బీసీలను మోసం చేస్తున్న బీజేపీ: కవిత

8
- Advertisement -

బీసీల నోటి కాడ ముద్దను బీజేపీ గుంజుకునే ప్రయత్నం చేస్తోంది అని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. బీజేపీ బీసీ వ్యతిరేక వైఖరిని ప్రజలంతా గమనిస్తున్నారు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్లలో ముస్లింలు ఉన్నారో లేదో క్లారిటీగా చెప్పలేదు అన్నారు.

ప్రభుత్వం చెప్పకముందే బండి సంజయ్ ఎందుకు ముస్లింల రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్నాడు… బీసీలను బీజేపీ పార్టీ మోసం చేస్తోంది అన్నారు. తెలంగాణ జాగృతి ఆవిర్భావ వేడుకల్లో భాగంగా జెండాను ఆవిష్కరించారు కవిత. ప్రొ.జయశంకర్ జయంతిని పురస్కరించుకుని నివాళులర్పించారు.

వలస పాలకుల చెరలో బందీ అయిన తెలంగాణ తల్లి విముక్తి కోసం ప్రొ.జయశంకర్ తిరగని ప్రాంతం లేదు… సమస్త వనరుల సిరుల మాగాణమైన తెలంగాణ యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని అనుక్షణం పరితపించారు అన్నారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కు మార్గదర్శిగా ఆయన చేసిన కృషి సదా స్మరణీయం అన్నారు.

Also Read:Chiru:రాజకీయాలకు దూరం

- Advertisement -