అనర్హత వేటు వేయాల్సిందే:గంగుల

10
- Advertisement -

ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది అన్నారు మాజీ మంత్రి గంగుల కమలాకర్.పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలని.. అసెంబ్లీలోని గాంధీ విగ్రహం ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మెరుపు ధర్నా చేపట్టారు.అసెంబ్లీ లో స్పీకర్ అందుబాటులో లేక పోవడంతో గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ప్రతినిధి బృందం.

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతున్నాం అన్నారు. స్పీకర్ తో కేటీఆర్ మాట్లాడారు… బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలుస్తారని చెప్పారు.. ఉదయం 11 గంటలకు సమయం ఇచ్చారు అన్నారు.

కానీ స్పీకర్ ఇంకా రాలేదు… స్పీకర్ కార్యాలయం వైపు వెళ్లే ద్వారం కూడా తెరవలేదు అన్నారు. అందుకే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చాం… పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని సభాపతిని కోరుతున్నాం అన్నారు.

Also Read:అనిల్ అంబానీకి ఈడీ మరో షాక్!

- Advertisement -