- Advertisement -
రాష్ట్రంలో ఉంది రాక్షస ప్రభుత్వం అని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కేటీఆర్… రాష్ట్రంలో వరి నాట్లు ఊపందుకున్నాయి… ఈ క్రమంలో ఎరువుల కోసం డిమాండ్ పెరుగుతోంది అన్నారు. అవసరమైన యూరియా కోసం రైతులు ఎదురుచూస్తున్నారు అన్నారు.
గత ప్రభుత్వం యూరియా కొరత లేకుండా అనేక చర్యలు చేపట్టినట్లు తెలిపారు. యూరియా, ఎరువుల కొరత రాకుండా కేసీఆర్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టినట్లు గుర్తు చేశారు.
అయితే, ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా 70 లక్షల మంది రైతులు రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్నారన్నారు. పొలంలో ఉండాల్సిన రైతన్నలు ప్రభుత్వ నిర్వాకం కారణంగా నేడు ఎరువుల దుకాణాల ముందు ఎదురుచూపులు చూస్తున్నారని చెప్పారు.
Also Read:చైన్ స్నాచింగ్..ఎంపీ గొలుసు కొట్టేశారు!
- Advertisement -

