అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన ప్రవర్తనతో వార్తల్లోకెక్కారు. ట్రంప్ ఓ జర్నలిస్ట్‌తో పరిహాసాలాడారు. ఇప్పుడదే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఐర్లాండ్ ప్రధానిగా లియో వరాడ్కర్ ఎన్నికైన సందర్భంగా ట్రంప్ ఓవల్ ఆఫీస్ నుంచి లియోకి ఫోన్ చేశారు. ఆయన లియోకి ఫోన్లో శుభాకాంక్షలు చెబుతున్నప్పుడు ఆయన ముందు ఐరిష్, అమెరికన్ మీడియా జర్నలిస్ట్‌లు ఉన్నారు. ఆ విషయాన్ని లియోకి ట్రంప్ చెప్పడంతో.. అక్కడున్న విలేకరులందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
ట్రంప్ లియోతో మాట్లాడుతూ.. ‘నా ముందు మీ ఐరిష్ ప్రెస్ కూడా ఉంది. ఇప్పుడే వారు నా రూమ్ నుంచి బయటికి వెళుతున్నారు.’ అన్నారు. ఇంతలో అక్కడే ఉన్న పెర్రీ అనే మహిళా విలేకరిని పిలుస్తూ.. ‘ఇలారా. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు. నీ నవ్వు చాలా బాగుంది’ అన్నారు.
మహిళా విలేకరి గురించి ట్రంప్ మాడ్లాడిన మాటలు ట్రంప్ అలా అనడం కెమెరాల్లో రికార్డ్ అయింది. ఈ వీడియోని పెర్రీ తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ ‘వింత ప్రవర్తన’ అని ట్వీట్ చేసింది.
వీడియో చూసినవారంతా ఓ పక్క దేశ ప్రధానితో మాట్లాడుతూ మరోపక్క అమ్మాయితో ఆ పరాచకాలేంటని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా ఓ జర్నలిస్ట్‌తో ట్రంప్ ఇలా ప్రవర్తించడంతో ట్రంప్ పై సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తోంది.