పత్రికా ప్రకటనలకే రూ.133 కోట్లు!

3
- Advertisement -

పత్రికా ప్రకటనలకు రూ.133 కోట్లు ఖర్చు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు నిధులు లేవని చెబుతూ, ప్రచారాల కోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.

ఎలక్ట్రానిక్ మీడియా, హోర్డింగులు, మెట్రో పిల్లర్లు, బస్ షెల్టర్లపై ప్రకటనలు కలపకుండానే ఈ ఖర్చు. ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానం ఇచ్చింది ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి ఈ సంవత్సరం జనవరి 31వ తేదీ వరకు ప్రచారాల కోసం ప్రభుత్వం చేసిన ఖర్చు తెలిపాలని ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేశారు రాజేంద్ర పల్నాటి అనే వ్యక్తి.

ఆర్టీఐ దరఖాస్తుకు బదులుగా రూ.133,03,25,741 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించింది ప్రభుత్వం. అంబేద్కర్ జయంతి సందర్భంగా చిన్న పత్రికలు, మ్యాగజైన్లకు రూ.2,86,09,246 ఒకసారి, రూ.68,51,100 రెండోసారి ఖర్చు చేసినట్టు, ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం రూ.17,60,01,794 కోట్లు ఖర్చు చేసినట్టు పేర్కొంది రాష్ట్ర ప్రభుత్వం.

Also Read:అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ

- Advertisement -