Kingdom:కింగ్‌డమ్ ట్విట్టర్ రివ్యూ

20
- Advertisement -

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన చిత్రం కింగ్‌డమ్. ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఈ చిత్రం ప్రీమియర్ షో చూసిన వారు పాజిటివ్ టాక్ ఇస్తున్నారు.

విజయ్ నటన, అనిరుధ్ సంగీతం, సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారు. అన్నదమ్ముల అనుబంధం, హీరోయిన్‌తో రొమాంటిక్ ట్రాక్ బాగుందని.. సత్యదేవ్, భాగ్యశ్రీ తమ పాత్రల్లో చక్కగా నటించారని తెలుస్తోంది. సాంకేతికంగా సినిమా చాలా ఉన్నతంగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మొదలైన కొన్ని నిమిషాల్లోనే కథలో లీనమయ్యేలా చేసి, పక్కదారి పట్టకుండా ప్రాపర్ స్టోరీ లైన్ మీదే డ్రామా నడిచింది. ఫస్టాఫ్ లో కింగ్డమ్ ని సెట్ చేసి, ఇంటర్వెల్ సీక్వెన్స్ తో సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారని తెలుస్తోంది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయని అంటున్నారు.

జైలు సీన్స్, బోట్ సీక్వెన్స్ సినిమాకే హైలైట్ అని… గౌతమ్ తిన్ననూరి మంచి కథను రాసుకోవడమే కాదు, దాన్ని పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారు అని చెబుతున్నారు. ఓవరాల్ గా ట్విట్టర్ టాక్ ని బట్టి ‘కింగ్డమ్’ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

Also Read:అనర్హత వేటుపై సుప్రీం సంచలన తీర్పు

- Advertisement -