సూపర్ స్టార్ మహేష్ బాబు..రాజమౌళి దర్శకత్వంలో భారీ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. SSMB29 వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మహేష్ సరసన ప్రియాంక చోప్రా జొనాస్ హీరోయిన్గా నటిస్తుండగా మలయాళ స్టార్ పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే హైదరాబాదు మరియు ఒడిశాలోని ముఖ్యమైన షెడ్యూల్లు పూర్తి అయ్యాయి.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం… హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో సుమారు 100 మంది స్టంట్ ఆర్టిస్టులు భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం రిహార్సల్స్ చేస్తున్నారు. ఈ యాక్షన్ షెడ్యూల్లో టాంజానియాలో చిత్రీకరించబడనుంది. ఆఫ్రికా షెడ్యూల్ ఆగస్టు రెండో వారం నుండి ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న ఎం.ఎం. కీరవాణి ప్రస్తుతం రాజమౌళి ఫామ్‌హౌస్‌లో మ్యూజిక్ సిట్టింగ్స్‌లో పాల్గొంటున్నారు.
Also Read:ఆరోజే సినిమాలు మానేస్తా!

