మూడు దేశాల పర్యటన ముగించుకుని ప్రధాని మోడీ ఢిల్లీకి చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో మోడీకి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్వాగతం పలికారు. మూడు దేశాల విదేశీ పర్యటనలో భాగంగా తొలి రోజు పోర్చుగల్ లో పర్యటించారు. ఆ దేశ ప్రధాని కోస్టాతో కలిసి పలు ఒప్పందాలపై సంతకాలు చేశారు. జూన్ 25న వాషింగ్టన్ చేరుకున్న మోడీ.. రెండ్రోజుల పాటు అమెరికాలో పర్యటించారు. అనంతరం నిన్న నెదర్లాండ్ లో పర్యటించారు.
నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రుట్టే.. ప్రధాని నరేంద్ర మోడీకి సైకిల్ కానుకగా ఇచ్చారు. అనంతరం ఇరు దేశాధినేతలు సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడారు. సమావేశం అనంతరం మార్క్.. మోడీకి సైకిల్ కానుకగా ఇచ్చారు. మోడీ సైకిల్‌పై ఎక్కి తొక్కుతున్న ఫొటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సందర్భంగా మాట్లాడిన మోడీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. సాంకేతికతతో ఫోన్లలోనే ఎక్కడున్నా అందరినీ కలుసుకోవచ్చన్నారు. ప్రపంచంలో ఏ మూలన ఉన్న భారతీయుడైనా మన దేశ దూతనేనన్నారు. యూరప్‌లో ఎక్కువ మంది భారతీయులున్న రెండో దేశం నెదర్లాండ్స్ అన్నారు.
Thank you @MinPres @markrutte for the bicycle. pic.twitter.com/tTVPfGNC9k
— Narendra Modi (@narendramodi) June 28, 2017