కాంతారా సినిమా కాదు..చరిత్ర!

4
- Advertisement -

2022లో విడుదలైన “కాంతార” సినిమా ఇండియన్ సినిమా పరంగా సరికొత్త దిశగా అడుగు వేసింది. 2022 సంవత్సరం లోనే అతిపెద్ద స్లీపర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించింది. పాన్-ఇండియా లెవెల్లో భారీగా విజయం సాధించి, కొత్త బంచ్‌మార్క్స్ క్రియేట్ చేసింది. కేజీఎఫ్, సలార్, కాంతార లాంటి బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన హోంబలే ఫిలింస్‌కి ఇది ఇంకో గొప్ప మైలురాయి అయ్యింది. ఇప్పుడు అదే సినిమాకి ప్రీక్వెల్‌గా రాబోతున్న కాంతార: చాప్టర్ 1 పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

రిషబ్ శెట్టి ఎప్పుడూ చూడని థ్రిల్లింగ్ అవతార్‌లో ఉన్న పోస్టర్ ఇప్పటికే ప్రేక్షకులలో సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ముగిసినట్లు మేకర్స్ వెల్లడించారు. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు.

ఈ వీడియోలో కాంతార ప్రపంచం ఎలా ఉంటుందో రిషబ్ శెట్టి వివరించిన తీరు ఆకట్టుకుంటుంది. కాంతార అంటే సినిమా కాదని.. తమ చరిత్ర అని రిషబ్ చెప్పుకొచ్చాడు. ఈ మేకింగ్ వీడియోలో కాంతార చిత్రానికి సంబంధించిన విజువల్స్, భారీ మేకింగ్, క్యాస్టింగ్ మనకు చూపెట్టారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిలింస్ బ్యానర్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తుండగా అక్టోబర్ 2న వరల్డ్‌వైడ్ రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు.

Also Read:TG:ఐజీఎస్టీ పేరుతో కేంద్రం రికవరీ!

- Advertisement -