వీరమల్లు..బాక్సాఫీస్ షేక్‌ పక్కా!

9
- Advertisement -

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో తెరకెక్కుతున్న తొలి పాన్ ఇండియా చిత్రం హరిహర వీరమల్లు. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ పలుమార్లు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి పోటీ లేకపోవడంతో వీరమల్లు మేనియానే కాదు బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

పవన్ కోసం దాదాపు 90 శాతం థియేటర్లు సిద్ధమవుతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పవన్ ఖచ్చితంగా వీరమల్లు సినిమాతో రికార్డులు బ్రేక్ రాయడం ఖాయంగా కనిపిస్తోంది. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోండగా బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఏఎం రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Also Read:తొలిసారి సినిమా ప్రమోట్ చేస్తున్నా:పవన్

- Advertisement -