ప్రేమించుకుందాం.. రా, బావగారూ బాగున్నారా, ప్రేమంటే ఇదేరా, ఈశ్వర్, లక్ష్మీనరసింహా, శంకర్‌దాదా యంబిబియస్, తీన్మార్ వంటి సూపర్‌హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన డీసెంట్ డైరెక్టర్ జయంత్ సి. పరాన్జీ ప్రస్తుతం రవి గంటా హీరోగా ‘కాళహస్తి’ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ‘ఉగ్రం’ పేరుతో ఓ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ను రూపొందించనున్నారు. ఇషాన్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించే ఈ చిత్రం ద్వారా నీలేష్ ఈటి హీరోగా, ఇజబెల్ హీరోయిన్గా పరిచయమవుతున్నారు.
ఈ చిత్రం గురించి దర్శకుడు జయంత్ సి. పరాన్జీ తెలియజేస్తూ – ”ఈ చిత్రం ద్వారా నీలేష్ ఈటి హీరోగా, ప్రముఖ మోడల్ ఇజబెల్ హీరోయిన్గా పరిచయమవుతున్నారు. ముంబాయి అండర్ వరల్డ్, ఒక తెలుగు పోలీస్ ఆఫీసర్ మధ్య జరిగే హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఈ చిత్రంలో వెల్ఫేర్ సెంటర్లో వర్క్ చేసే ఎన్ఆర్ఐ క్యారెక్టర్లో ఇజబెల్ నటిస్తుంది. నవంబర్‌లో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తాం. ఎక్కువ భాగం ముంబాయిలోనూ, మిగతా హైదరాబాద్‌లో ఈ చిత్రం షూటింగ్ జరుగుతుంది. మిగిలిన నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం” అన్నారు.
నీలేష్ ఈటి, ఇజబెల్ జంటగా నటించే ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: రాజ్‌కుమార్, ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్, ఆర్ట్: కృష్ణమాయ, కాస్ట్యూమ్స్: కార్తీక్ దామని, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: లక్ష్మణ్, రచన, దర్శకత్వం: జయంత్ సి.పరాన్జీ.
జయంత్ సి. పరాన్జీ ‘ఉగ్రం’
- Advertisement -
- Advertisement -