రేవంత్ రెడ్డి..బఫూన్: జగదీశ్‌ రెడ్డి

11
- Advertisement -

కేసీఆర్ హయాంలో 6,47,479 కొత్త రేషన్ కార్డులు ఇచ్చినం అన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి.. జూలై 2021 లో ప్రతిపక్ష నేతగా భట్టి విక్రమార్క తన నియోజకవర్గంలో రేషన్ కార్డులు పంచిండు అన్నారు.ఇప్పటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాజీ ఎంపీ గా బీఆర్ఎస్ లో ఉన్నపుడు రేషన్ కార్డుల పంపిణీ గురించి ప్రత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు అన్నారు.

చౌటుప్పల్ లో అప్పటి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సమక్షంలో నేను రేషన్ కార్డులు పంచాను… ఆధారాలతో బయటపెట్టారు జగదీశ్ రెడ్డి. రేవంతూ.. గుర్తు పెట్టుకో
నల్లగొండ నుండి ఒక్కడినే ఉన్నా..ఈసారి కాంగ్రెస్ నుండి ఒక్కడిని కూడా అసెంబ్లీకి రానివ్వను అని శపథం చేశారు.

పంట వేసినప్పుడు కొన్ని లొట్టపీసు చెట్లు, కలుపు మొక్కలు వచ్చినట్టు, సినిమాలో తాత్కాలికంగా విలన్లు వచ్చినట్లు.. తెలంగాణలో సీఎం, మంత్రులు వచ్చారు అన్నారు. రేవంత్ రెడ్డి ఎన్ని రోజులు ముఖ్యమంత్రిగా ఉంటాడో తెల్వదు.. సీఎం పదవి ఉండే చివరి రోజుల్లో అయినా ఙ్ఞానం తెచ్చుకోమని రేవంత్ రెడ్డికి సలహా ఇస్తున్నాను అన్నారు.

చంద్రబాబు కోసం బనకచర్లకు అడ్డురాకుండా ఉండడానికి కాళేశ్వరాన్ని పండబెడుతున్నారు… నీళ్ల విషయంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న ప్రతి అక్షరం చంద్రబాబు రాసి పంపిందేనని తెలిపారు. నీ మంత్రులు, నువ్వు వేలాది లారీలతో ఇసుక తవ్వడానికి.. నువ్వు ఇవ్వాళ కాళేశ్వరం నీళ్లను ఇవ్వడం లేదు అన్నారు. రేవంత్ రెడ్డి బుడ్డర్ ఖాన్, బఫూన్, రాజు, మంత్రి, భటుడు ఇలా అన్ని పాత్రలు వేస్తున్నాడు అన్నారు.

Also Read:భార్యల చేతిలో భర్తల హతం

- Advertisement -