మల్లన్న వ్యాఖ్యలు ఖండిస్తున్నాం

7
- Advertisement -

తీన్మార్ మల్లన్న వెంటనే ఎమ్మెల్సీ కవితకి బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేత,మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి.

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న.. ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవితపై చేసిన అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అని తెలిపారు. మహిళల గౌరవాన్ని కాపాడటం మన సంస్కృతి. వ్యక్తిగత దూషణలు, మహిళలను కించపరిచే వ్యాఖ్యలకు రాజకీయాల్లో చోటు లేదు అన్నారు.

బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న ప్రజాప్రతినిధులు మాట్లాడే భాష మహిళలను కించపరిచేలా ఉండడం తగదు. ఆడబిడ్డల గురించి మాట్లాడేటప్పుడు సోయితో మాట్లాడితే మంచిది అని హితవు పలికారు.

Also Read:మల్లన్నపై పోలీసులకు ఫిర్యాదు

- Advertisement -