ములుగు జిల్లా చల్వాయిలో కాంగ్రెస్ సర్కారు వేధింపులకు బలైన చుక్క రమేష్ కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆర్థిక సహాయం అందజేశారు. రెడ్కో మాజీ చైర్మన్ వై. సతీష్ రెడ్డి, ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జి బడే నాగజ్యోతి, ములుగు జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ రావు. శనివారం రోజున చుక్క రమేష్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు డబ్బులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చుక్క రమేష్ ది కాంగ్రెస్ ప్రభుత్వ హత్య అని ఆరోపించారు. ఇందిరమ్మ ఇళ్లలో జరుగుతున్న అవకతవకలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు పోలీసులను పంపి వేధించారని అన్నారు. అర్హులకు, నిజమైన పేదలకు ఇల్లు రావాలని మాట్లాడినందుకు కాంగ్రెస్ సర్కారు ఆయనపై కక్షగట్టి ప్రాణాలు తీసుకుందని మండిపడ్డారు.
ములుగు జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు కాంగ్రెస్ నాయకుల చేతుల మీదుగా ఇప్పిస్తూ వారు ఇష్టారాజ్యంగా లంచాలు దండుకునేలా ప్రోత్సహిస్తున్న జిల్లా మంత్రి సీతక్క వసూళ్ల వ్యవహారం బయటపడుతుందని చుక్క రమేష్ పై సర్కారు కక్ష కట్టిందన్నారు. ఈ క్రమంలోనే అక్రమాలు బయటపెట్టిన ఆంధ్రజ్యోతి రిపోర్టర్ పైన సీతక్క మనుషులు కాంగ్రెస్ గుండాలు దాడి చేశారన్నారు. ఇలా ములుగులో జరుగుతున్న దారుణాల బయట పడుతుండడంతో సీతక్క తన అధికార బలాన్ని ఉపయోగించి చుక్కా రమేష్ ప్రాణాలు తీసుకున్నారని ఆరోపించారు.కేవలం ములుగులోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల అరాచకాలు పెచ్చు మీరిపోతున్నాయని ఆరోపించారు. పేదల నుంచి అడ్డగోలుగా దండుకుంటున్నారని, లేకపోతే ఇల్లు ఇచ్చేది లేదని బెదిరిస్తున్నారని, పట్టాలు ఇచ్చిన తర్వాత కూడా రద్దు చేయిస్తున్నారని వివరించారు. కాంగ్రెస్ కార్యకర్తలకు, రూ. 50 వేల నుండి లక్ష రూపాయలు లంచం ఇచ్చే వాళ్లకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తున్నారని ఆరోపించారు. దీనిపై ప్రశ్నించిన బీఆర్ఎస్ కార్యకర్తలపై, పేద ప్రజలపై రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ రెడ్డి సర్కారు పోలీసులను, కాంగ్రెస్ గూండాలను ఉసిగొలుపుతోందని ఫైర్ అయ్యారు.
చుక్కా రమేష్ మరణంపై ఎంక్వయిరీ జరిపించాలని బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పోలీసుల వేధింపులతో రమేష్ మరణించారు కాబట్టి ఆయన కుటుంబానికి ప్రభుత్వం నుంచి రూ. 50 లక్షల రూపాయల పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లలో దోపిడీ, అవినీతి అక్రమాలకు కేరాఫ్ గా మారిన ఇందిరమ్మ కమిటీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలను పీల్చి పిప్పి చేసి వారి జేబులు గుల్ల చేస్తున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. నేరుగా ప్రభుత్వ అధికారులే ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు లబ్ధిదారులకు అందించాలని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరగాలని కోరారు.
ఇప్పటివరకు కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ కమిటీల పేరుతో ఎవరెవరి దగ్గర ఎంతెంత వసూలు చేశారో ఒక ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి బయటకు తీయాలని డిమాండ్ చేశారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇందిరమ్మ కమిటీల పేరుతో తెరలేపిన దోపిడీ రాజ్యానికి ముగింపు పలకకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. పేద ప్రజల పక్షాన తాము నిలిచి లంచగొండి కాంగ్రెస్ ను కోర్టు మెట్లు ఎక్కించే వరకు ఊరుకోబోమని తేల్చి చెప్పారు.కాంగ్రెస్ సర్కారు పోలీసులను పంపినంత మాత్రాన పేదలు గానీ, బీఆర్ఎస్ కార్యకర్తలు గానీ అధైర్య పడవద్దని, ఆందోళన గురి కావద్దని, వెంటనే బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ను సంప్రదిస్తే వారు తక్షణ న్యాయ సహాయం అందిస్తారని సూచించారు.
పేదల కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్ పనిచేస్తుందని అన్నారు. తప్పుడు కేసులు పెట్టిన కాంగ్రెస్ నాయకులు, కేసులు ఫైల్ చేసి వేధింపులకు గురి చేస్తున్న పోలీసులకు న్యాయస్థానాల్లో కచ్చితంగా తగిన బుద్ధి చెబుతామని అన్నారు. ఇప్పటికే అనేక కేసుల్లో సర్కారుకు గౌరవ హైకోర్టు మొట్టి కాయలు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్కో మాజీ చైర్మన్ వై సతీష్ రెడ్డి, ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జి బడే నాగజ్యోతి, ములుగు జిల్లా అధ్యక్షులు లక్ష్మణ్ రావు గారు, ములుగు జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read:డయాబెటిస్ నివారణ..చిట్కాలు

