- Advertisement -
ఆర్సీబీ విక్టరీ పరేడ్ తొక్కిసలాటకు కారణం ఆ టీమేనని జ్యూడీషియల్ కమిషన్ నివేదిక ఇచ్చింది. తొక్కిసలాటకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB), కర్ణాటక స్టేట్ క్రికెట్ అస్సోసియేషన్(KSCA), ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్, బెంగళూరు పోలీసులదే బాధ్యత అని నివేదిక ఇచ్చింది జ్యుడీషియల్ కమిషన్.
నివేదికను సీఎం సిద్దరామయ్యకు అందించింది జ్యుడీషియల్ కమిషన్. ఈ తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయాలు అయ్యాయి. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.
ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలవడంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో విక్టరీ పరేడ్ అనౌన్స్ చేశారు. దీంతో ఒక్కసారిగా స్టేడియంలోపలికి తోసుకెళ్లారు అభిమానులు. బారికేడ్లు దూకి వెళ్లగా అభిమానులను అదుపుచేయలేకపోయారు పోలీసులు.
Also Read:డయాబెటిస్ నివారణ..చిట్కాలు
- Advertisement -

