కాంగ్రెస్‌ నేతలకు బూతుల్లో డాక్టరేట్:రసమయి

6
- Advertisement -

ఇది వానాకాలం లా లేదు…కుక్కల కాలం లా ఉంది అని ఎద్దేవా చేశారు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన రసమయి..ఈ కాలం లో కుక్కలకు వాక్సిన్ వేస్తారు .కాంగ్రెస్ కుక్కలకు వాక్సిన్ వేయనట్టున్నారు .అందుకే ఇష్టం వచ్చినట్టు మొరుగుతున్నయ్ అన్నారు. సవాల్ కు వెనుదిరగని బిడ్డలు బీ ఆర్ ఎస్ నేతలు ….పదవులు గడ్డిపోచల్లా వదిలిన చరిత్ర బీ ఆర్ ఎస్ నేతలది అన్నారు.

రేవంత్ సవాలును కే టీ ఆర్ స్వీకరించి 72 గంటల టైమ్ కూడా ఇచ్చారు… అయినా రేవంత్ చర్చకు రాకుండా పారిపోయారు, కే టీ ఆర్ గురించి కాంగ్రెస్ నేతలు అసభ్యంగా మాట్లాడుతున్నారు కనుకే వారిని కుక్కలు అంటున్నా … కాంగ్రెస్ నేతలతీరు చూసి కాలం కన్నీళ్లు పెట్టుకుంటోంది .అందుకే వర్షాలు పడటం లేదు అన్నారు.

ప్రజా సమస్యలను డైవర్ట్ చేయడానికే కాంగ్రెస్ నేతలు కేసీఆర్ ,కే టీ ఆర్ లపై అసభ్య ఆరోపణలు చేస్తున్నారు…ఇందిరమ్మ ఇండ్ల పేరిట కాంగ్రెస్ నేతలు ఇసుక దందాలు చేస్తున్నారు , పందొమ్మిది నెలల పాలనలో కాంగ్రెస్ చేసింది శూన్యం …కే టీ ఆర్ అమెరికా లో పని చేసుకుంటూ చదివితే తప్పేమిటీ ?, కాంగ్రెస్ నేతల్లా జేబులు కొట్టి బతకాలా ? చెప్పాలన్నారు.

కే టీ ఆర్ అమెరికా వదిలింది తెలంగాణ ఉద్యమం కోసమే..కొందరు లుచ్చా గాళ్ళకు కే టీ ఆర్ బచ్చా గానిలా కనిపిస్తారు ,వార్డ్ మెంబెర్ గా గెలవని వాళ్ళు కూడా కే టీ ఆర్ ను విమర్శిస్తున్నారు ..కే టీ ఆర్ విద్యావంతుడు కనుకే ప్రపంచ యూనివర్సిటీ లు ఆయన్ను ఉపన్యాసానికి పిలుస్తున్నారు..కే టీ ఆర్ కు సొంత శక్తి లేకపోతే అన్ని సార్లు రాజీనామా చేసి గెలవలేరు,కే టీ ఆర్ అసెంబ్లీ లో ఉన్నపుడు అసెంబ్లీ పాస్ కోసం ప్రయత్నించిన వారు కూడా ఇవ్వాళ మాట్లాడ్తున్నారు ..కేసీఆర్ లేకపోతే తెలంగాణ జే ఏ సి ఎక్కడిది ?,తెలంగాణ జే ఏ సి లో పని చేసిన వారు కూడా మాట్లాడుతున్నారు …మీ అయ్య అని కే టీ ఆర్ తండ్రి కేసీఆర్ నుద్దేశించి మాట్లాడుతున్నారు అన్నారు. కేసీఆర్ కే టీ ఆర్ కే అయ్య కాదు ..తెలంగాణ కు అయ్య ..కాంగ్రెస్ నేతలు బూతుల్లో డాక్టరేట్ చేశారు .. వెయ్యి జన్మలెత్తినా కాంగ్రెస్ నేతలు కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోరు అన్నారు.

కేసీఆర్ ,కే టీ ఆర్ ,హరీష్ రావు లను తిడితే హెడ్ లైన్లలో ఉంటామనే కాంగ్రెస్ నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారు …రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నారు ?,ఉద్యమం పై దాడులు చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి …ప్రజలు కాంగ్రెస్ నేతల తిత్తి తీయడానికి సిద్ధంగా ఉన్నారు …కాంగ్రెస్ ఇక జన్మ లో అధికారం లోకి రాదు,మళ్ళా కాంగ్రెస్ అధికారం లోకి వస్తే నా తలను గాంధీ భవన్ పై వేలాడదీసుకుంటా .ఇదే నా మరణ వాంగ్మూలం …అద్దంకి దయాకర్ ఇకనైనా జాగ్రత్తగా ఉండాలి ,మధు యాష్కీ ఎమ్మెల్యేనా కే టీ ఆర్ ను అసెంబ్లీ కి రమ్మన్నాడు …కే టీ ఆర్ వస్తేనే పారిపోతున్నారు .ఇంకా కేసీఆర్ రావాలా ?,పెద్ద కుక్క అరిస్తే చిన్న కుక్కలు అరిచినట్టు ఉంది కాంగ్రెస్ లో సీఎం ,నేతల తీరు ..అసెంబ్లీ పెట్టండి .ఎవరు వద్దన్నారు .అసెంబ్లీ పెట్టడానికి కేసీఆర్ ముఖ్యమంత్రా ?…సాంస్కృతిక సారధి లో ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేయడం దారుణం ..వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలి అన్నారు.

Also Read:బడే భాయ్..చోటే భాయ్ ముస్లిం వ్యతిరేకులే!

- Advertisement -