- Advertisement -
మహిళల పట్ల వైసీపీ ద్వేషాన్ని ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలు బహిర్గతం చేశాయి అని మండిపడ్డారు నారా భువనేశ్వరి. మహిళా వ్యతిరేక మనస్తత్వాన్ని ప్రసన్న వ్యాఖ్యలు బహిర్గతం చేశాయి.. మహిళల పట్ల వైసీపీ తీరు సిగ్గుచేటు అన్నారు.
సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలకు స్థానం లేదు.. ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి నా సంఘీభావం ప్రకటిస్తున్నా.. ప్రశాంతిరెడ్డిపై చేసిన అవమానకర వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు. మహిళల పట్ల అవమానకర పదాలు వారి విలువను తగ్గించలేవు అన్నారు.
మన సంస్కృతి, విలువలు మహిళల పట్ల గౌరవాన్ని నిలబెట్టాయి.. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే ఏ ప్రయత్నాన్నైనా ఖండించాల్సిందే… ప్రతి స్త్రీ గౌరవానికి మద్దతు ఇవ్వడానికి ఐక్యంగా నిలబడతాం అన్నారు.
Also Read:విద్యార్ధులకు భోజనం కూడా పెట్టలేరా?:కేటీఆర్
- Advertisement -

