విద్యార్ధులకు భోజనం కూడా పెట్టలేరా?:కేటీఆర్

7
- Advertisement -

పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న నాణ్యత లేని భోజనం పైన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిస్ వరల్డ్ పేరిట లక్ష రూపాయలకు ఒక ప్లేటు చొప్పున భోజనం పెట్టిన ప్రభుత్వం పేద విద్యార్థులకు కనీసం అన్నం కూడా పెట్టడం లేదు అన్నారు.

ముఖ్యమంత్రి మంత్రులు వేములవాడ దేవాలయాన్నీ సందర్శించినప్పుడు హైదరాబాద్ నుంచి 32 వేల రూపాయలకు ప్లేటు చొప్పున భోజనం తెప్పించుకుని తిన్నారు కానీ పేద విద్యార్థులకు కారం నీళ్ల భోజనం పెడుతున్నారు అన్నారు.

తెలంగాణ భవిష్యత్తు అయిన విద్యార్థులకు నీళ్ల సాంబార్ భోజనం పెట్టడమే ప్రజా పాలనలో సాధించిన విజయమా అంటూ ప్రశ్న… ఇప్పటిదాకా 90 మంది గురుకుల విద్యార్థులు చనిపోతే ముఖ్యమంత్రికి కనీసం వారి మరణాలను గుర్తించే సమయం కూడా లేదు అన్నారు. తెలంగాణ ప్రజలను కనీసం మనుషులుగా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించదా …ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరైన భోజనం అందించడం కూడా చేతకాదా చెప్పాలన్నారు.

Also Read:సిద్ధు జొన్నలగడ్డ.. ‘బ్యాడాస్’!

- Advertisement -