బాలయ్యతో వెంకీ..బిగ్గెస్ట్ మల్టీస్టారర్!

5
- Advertisement -

టాలీవుడ్‌లో ప్రస్తుతం మల్టీస్టారర్ మూవీల ట్రెండ్ నడుస్తోంది. అగ్ర హీరోలు సైతం మల్టీస్టారర్ సినిమాలకు సై అంటుండటంతో ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తోంది. ఆర్ఆర్ఆర్‌తో రామ్ చరణ్ – ఎన్టీఆర్ వెండి తెరను షేక్ చేయగా తాజాగా అలాంటి కాంబోనే మళ్లీ రాబోతుంది.

నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ త్వరలో ఓ మల్టీస్టారర్ చిత్రంలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని అమెరికాలో జరుగుతున్న తానా సభల్లో వెంకటేష్ వెల్లడించారు.

Also Read:బీజేపీలో ‘కొండా’ కలకలం!

త్రివిక్రమ్‌తో ఓ సినిమా,చిరు-అనిల్ మూవీలో ఓ కేమియో రోల్,మీనాతో కలిసి ‘దృశ్యం-3’,అనిల్ రావిపూడి తో మరో సినిమా ఆ తర్వాత బాలయ్యతో ఓ మల్టీస్టారర్ చిత్రం ఉండబోతుందని తెలిపాడు. దీంతో ఈ మల్టీస్టారర్‌ మూవీపై భారీ అంచనాలు పెరిగిపోయాయి.

- Advertisement -