హరితహారంలో తడికొండ గ్రామస్తులు

4
- Advertisement -

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేపట్టిన హరిత హారం 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా 10 మొక్కలు నాటడం జరిగింది. కేసీఆర్ చేపట్టిన హరిత హారం 10 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినీపల్లి మండలం తడగొండ గ్రామంలో హరిత హారంకు గుర్తుగా 10 మొక్కలు నాటారు బిఆర్ఎస్ నాయకులు.

ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ చిందం రమేష్ చేపూరి మహిపాల్ మాట్లాడుతూ గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు చేపట్టిన హరితరం నిన్నటితో 10 వసంతాలు పూర్తిచేసున్న సందర్భంగా స్థానిక బిఆర్ఎస్ నాయకులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది. ఈ హరిత హారం కార్యక్రమానికి తోడుగా గౌరవ జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరిత సేనలో మొక్కలు నాటడం జరుగుతుంది అన్నారు.

పర్యావరణ పరిరక్షణ కోసం కాబట్టి పార్టీలకు అతీతంగా అందరూ మొక్కలు నాటాలని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న బిఆర్ఎస్ నాయకులు కట్ట లింగయ్య, గోగురీ తిరుపతి పొన్నం తిరుపతి,రెడ్డి,మున్నూరుకపు సంఘం అధ్యక్షులు బుర్ర రాజు,బొడ్డు రమేష్ ,తాడగొండ రాజేష్ , మూదం కమలాకర్ ,దయ్యాల రాయమల్లు, వంచ కనుకరెడ్డి, అందాల లచ్చిరెడ్డి, చేపూరీ మహిపాల్,బుర్ర కనకయ్య ,సింగరి నరేష్, మరియు హరిత సేన సభ్యులు కమల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read:వందా..బొందా..జడ్పీటీసీలను గెలిపించు!

- Advertisement -