నన్ను ట్రోల్ చేస్తున్నారు:జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి

18
- Advertisement -

ఏపీ హైకోర్టులో జస్టిస్ కె. శ్రీనివాసరెడ్డి సోషల్ మీడియా ట్రోలింగ్‌పై స్పందించారు. తనని గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు అన్నారు. సింగయ్య కేసులో జగన్ పిటిషన్, తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో నిందితులుకు బెయిల్ ఇచ్చారు జస్టిస్ కె. శ్రీనివాసరెడ్డి.

ఈ నేపథ్యంలో సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని వ్యాఖ్యనించారు జస్టిస్ కె. శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు కల్తీ నెయ్యి కేసులో నిందుతులకు బెయిల్ ఉత్తర్వులు కూడా ట్రోల్స్ కు పనికి వస్తాయి… తన ముందున్న బెయిల్ కేసులన్నీ వచ్చేవారం వేరే బెంచ్ ముందు చూసుకోవాలని సూచించారు జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి.

టీటీడీకి నకిలీ నెయ్యి సరఫరా బోలేబాబా డెయిరీ డైరెక్టర్లకు బెయిల్‌ మంజూరు చేసింది హైకోర్టు. పోమిల్‌ జైన్‌(ఏ3), విపిన్‌ జైన్‌(ఏ4)కు,వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్‌ వినయ్‌ కాంత్‌ చావడా(ఏ5)కు బెయిల్‌ మంజూరు చేసింది న్యాయస్థానం. దర్యాప్తునకు సహకరించాలని పిటిషనర్లకు హైకోర్టు స్పష్టంచేసింది.

Also Read:ఓటిటిలోకి ‘థగ్ లైఫ్’!

- Advertisement -