Harishrao:నీటి హక్కులపై చర్చకు సిద్ధం

5
- Advertisement -

సీఎం బాధ్యతగా మాట్లాడుతాడు అనుకుంటే, రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ అన్ని అబద్దాలే మాట్లాడుతున్నడు రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు మాఈ మంత్రి హరీష్ రావు. తెలంగాణ భవన్ వేదిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తం కుమార్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ప్రతిపక్షంలో అబద్దాలు, అధికారంలో అబద్దాలు మాట్లాడుతున్నడు.అబద్దాలు, తప్పులు మాట్లాడినప్పుడు పాఠకులకు, ప్రజలకు వార్తలు చేరవేయాల్సిన బాధ్యత మీడియాపై ఉందని వినతి చస్తున్నం. రాష్ట్రాన్ని సాధించి, దిక్సూచిగా నిలిచిన పార్టీ బిఆర్ఎస్. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం.కానీ అధికార పక్షం, రేవంత్ రెడ్డి ప్రజల హక్కులు కేంద్రంగా కాకుండా రాజకీయాలే కేంద్రంగా బురద జల్లుతున్నారు.క్రాస్ చెక్ చేసి వార్తలు రాయాలని కోరుతున్నా అన్నారు.

అధికారిక ప్రజెంటేషన్ అయితే ఎందుకు అందరు ఎమ్మెల్యేలను పిలువలేదు…అది హైదరాబాద్ లో ఇచ్చినట్లు లేదు, అమరావతిలో ఇచ్చినట్లు ఉంది,పీపీటీ తెలంగాణ ప్రభుత్వం తయారు చేసిందా, లేక ఏపీ తయారు చేసిందా..బనకచర్లను ఆపాలని చిత్తశుద్ది ఉంటే మీరు చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖలు, ఆయన మాట్లాడిన మాటలు గాని చూపాలి,కాళేశ్వరంను, పాలమూరు, డిండి, తుమ్మిళ్ల, భక్తరామ దాసు వంటి అనేక ప్రాజెక్టును చంద్రబాబు అడ్డుకున్నడు.
ఎందుకు ఒక్క ముక్క కూడా పీపీటీలో చూపించలేదు..బనకచర్ల కట్టే బాబు బంగారం లెక్క కనిపిస్తే, బిఆర్ఎస్ సచ్చిన పాము లెక్క కనిపిస్తున్నది రేవంత్ రెడ్డికి.
నీకు నిద్రలో కూడా గులాబి జెండా కనిపిస్తున్నది.కేంద్రంలో మీ పార్టీ 11 సంవత్సరాలుగా అధికారానికి దూరంగా ఉంది, అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యే సీటు గెలవలేదు, అంతమాత్రాన కాంగ్రెస్ సచ్చిన పాలు అయ్యిందా,సచ్చిన పాము లాంటి చవకబారు ముచ్చట్లు రాహుల్ కు చెప్పు..ఎమ్మెల్సీ నీ సొంత జిల్లాలో గెలిచినం.
అధ:పాతాళానికి ప్రజలు తొక్కుతారు, అహంకారంతో మాట్లాడితే బాసన్ల గురించి తెలిసినంత సులువు కాదు, బేసిన్ల గురించి తెలుసుకోవడం,భయం లేని కోడి బజార్ల గుడ్డు పెట్టినట్లు ఉంది,బనకచర్ల మీద బొంకుడు రాజకీయాలు బంద్ పెట్టు..బ్యాగులు మోసి బ్యాడ్ మెన్ గా పేరు తెచ్చుకున్నడు అన్నారు.

బనకచర్ల కోసం బొంకు మెన్ గా మారిండు..టెక్నికల్ గా కాంగ్రెస్ ముఖ్యమంత్రివి కానీ, హృదయం ఇంకా తెలుగుదేశంలోనే ఉంది.స్కూల్ ఏజ్ కాలేజ్ ఏజ్ లో ఉన్న చంద్రబాబుతో నీ అనుబంధం మరిచిపోవడం లేదు..జులై 6, 2024 నాడు ప్రజా భవన్ కు చంద్రబాబును పిలిచి విభజన హామిల ముసుగులో గోదావరి బనకచర్ల మధ్య చీకటి ఒప్పందం జరిగింది.ప్రజాభవన్ వేదికగా తెలంగాణ నీటి హక్కులకు మరణ శాసనం రాసిండు రేవంత్ రెడ్డి.Sep 13, 2024 నాడు ఉత్తం కుమార్ రెడ్డి సతీ సమేతంగా విజయవాడలో చంద్రబాబును కలిసి బెజవాడ బజ్జీలు తిని బనకచర్లకు మద్దతు చెప్పి వచ్చిండు.ఈక్రమంలోనే.. నవంబర్ 15, 2024 నాడు Ap – Gb లింక్ కు సహకరించాలని నిర్మలా సీతారామన్ కు చంద్రబాబు లేఖ..ఆ తర్వాత వెంటనే డిసెంబర్ 31, 2024 నాడు నిర్మలకు మరో లేఖ. 80 వేల కోట్లు ప్రాజెక్టు కోసం ఆర్థిక సాయం అందించాలని కోరిన చంద్రబాబు.గోదావరి నీళ్ల తరలింపు కుట్రలు జరుగుతుంటే తనకేం తెలియనట్లు మౌనంగా ఉన్నడు, నటించిండు రేవంత్ రెడ్డి? ఈ చీకటి అధ్యాయం బయట పడదు అనుకున్నడు అన్నారు.

మాకు రేవంత్, బాబు కుట్రలు తెలియగానే నిలదీశాం. జనవరి 24, 2025 నాడు మొట్ట మొదట నేను తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టి అడిగిన. గడ్డి పీకుతున్నరా అని ప్రశ్నించిన. ..అప్పుడు నిద్ర లేచి 22 జనవరి తేదీతో రాసినట్లు లేఖ సృష్టించి మీడియాకు విడుదల చేశారు..జూన్ 14, 2025 నాడు నేను పీపీటీ పెట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, అదే రోజు పాత డేట్ వేసి లెటర్ విడుదల చేసారు.అసలు గోదావరి బనకచర్ల మీద పోరాడింది బిఆర్ఎస్, కర్రు కాల్చి వాత పెట్టింది బిఆర్ఎస్.
రేవంత్ రెడ్డి అడ్డంగా దొరికి పోయిండు.అపెక్స్ కమిటీ మీటింగ్ లో బనక చర్ల అనే పదం ఉందా రేవంత్ రెడ్డి ఎందుకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నవు.
ఒక్క పేరా చదివి ఎజెండా 5లో చెప్పిన అంశాలను ఎందుకు చదవలేదు.వరద జలాల వినియోగంలో రెండు రాష్ట్రాలు ఉపయోగ పడే విధంగా, ఆమోదయోగ్యంగా వాడుకునేందుకు సంప్రదింపులు చేసుకోవాలని ఉంది. అంతే గాని అందులో బనకచర్ల అని ఉందా, నీళ్ళు తరలించుకుపో అని ఉందాఎందుకు ఇంత చిల్లరగా మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి.చంద్రబాబు ముందుకు రాలేదు, జగన్ ముందుకు రాలేదు, అది ముందుకు పడలేదుఇప్పుడు ముందుకు ఎలా పోతున్నది. బాబును ప్రజా భవన్ పిలించిండు, ఉత్తం బెజవాడ పోయి బజ్జీలు తిని అమోదం తెలిపిండు.ఎజెండా 5లో తెలంగాణ అనుమతి లేకుండా నీళ్ల డైవర్షన్ కు ఒప్పుకునేది లేదని చెప్పిండు కేసీఆర్ అన్నారు.

నువ్వు రాసిన పీపీటీలోనే బనకచర్ల అనేది లేదు. నువ్వు హెడ్డింగ్ కావాలని 2016 గోదావరి పెన్నా అనుసంధానం అని పెట్టినవు..ఇంత చిల్లరగా, ఇంత చిచోరగా ఉన్నవు.దమ్ముంటే అసెంబ్లీ పెట్టు వాస్తవాలు బట్టబయలు చేస్తం. మైక్ కట్ చేయకు, కెమెరా తిప్పకు….అపెక్స్ లో గోదావరి పెన్నా గాని, బనకచర్ల అని గాని ఎక్కడా లేదు. అన్నారు.

కేసీఆర్ మొత్తం నీళ్ళు వదిలేసిండు అంటడు రేవంత్ రెడ్డి.. 2.10.2020 నాడు కేసీఆర్ గారు గజేంద్ర సింగ్ షకావత్ కు లేఖ రాసారు. అందులో ఏముంది 3000 టిఎంసీల మిగులు జలాలు సగటున ఉంటున్నాయి. ప్రస్తుతం ఉన్న 968 కాక, ఈ మూడు వేలలో వాటా కావాలని, మొత్తం 2918 టిఎంసీలు తెలంగాణ హక్కు అని స్పష్టంగా కేసీఆర్ గారు రాసారు. గోదావరిలో వెయ్యి, కృష్ణాలో 500 టీఎంసీలు ఇచ్చి ఏమైనా చేసుకో అన్నడు మొన్న. నువ్వెవడివి తెలంగాణ హక్కులు వదిలి పెట్టడానికి. అంటే నిన్న రేవంత్ రెడ్డి మాట మార్చిండు, వరద జలాల్లోనూ వాటా కావాలని నిన్న అంటున్నడు. 3000 టీఎంసీలు అనేది ఓసారి బ్రహ్మ పదార్థం అంటడు, రాచ పుండు అంటడు రేవంత్ రెడ్డి..ఈ లెక్క చెప్పింది ఎవరు సిడబ్లుసీ చెప్పింది అన్నారు.

సముద్రంలో కలిసే జలాలు 58 ఏండ్ల సగటు 3వేల టీఎంసీల దాకా ఉంది…ఇది తెల్వక రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నడు..నదీ మార్గంలో నీళ్లు తేవాలని ఆనాడు కేసీఆర్ గారు, జగన్ తో అన్నరు.అది కాదని భూభాగంలో నీళ్లు తరలించే ప్రయత్నం మొదలు పెట్టారు.కేసీఆర్ గారి ఆదేశాల మేరకు 2022లో నేను ఢిల్లీ వెళ్లి షకావత్ గారికి లేఖ అందించాను.గోదావరి పెన్నా లింక్ అడ్డుకోవాలని కోరాను. గోదావరి బనకచర్ల ప్రాజెక్టులో కృష్ణి నీళ్ల మళ్లింపు కూడా ఉంది.డీపీఆర్ లో క్లియర్ గా పేర్కొన్నారు. రెండు నదుల నీళ్లు కొల్లగొడుతామని చెప్పారు.నాగార్జునసాగర్ కుడి కాల్వను డబుల్ చేసి, రోజుకు 2 టిఎంసీల చొప్పున వరద జలాల పేరిట బొల్లపల్లి రిజర్వాయర్ కు తరలిస్తామంటున్నరు.ఒకైవపు గోదావరి, మరోవైపు కృష్ణా నీళ్ల తరలింపు కోసమే గోదావరి బనకచర్ల..ఏ విధంగా చూసినా గోదావరి బనకచర్ల తెలంగాణకు మరణ శాసనం కాబోతున్నది..నువ్వు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ తెలంగాణ ద్రోహివే. నీళ్లు ఏపీకి దారాదత్తం చేసి తెలంగాణ ద్రోహిగా మిగిలిపోకు రేవంత్ రెడ్డి అన్నారు..

ద్రోహం కాంగ్రెస్ పార్టీదే… తెలంగాణకు పట్టిన అబద్దాల వైరస్ ఈ రేవంత్ రెడ్డి..అబద్దాల వైరస్ కు విరుగుడు బిఆర్ఎస్ అనే టీకా బయట వాళ్లకు సద్దులు కడుతూ ఇంటి మనిషిపై నిందలు వేస్తున్నడు తెలంగాణ సాధించింది కేసీఆర్, సెక్షన్ 3 సాధించి కృష్ణాలో నీటి వాటా సాధించేందుకు కృషి చేస్తున్నడు కేసీఆర్. హక్కుల విషయంలో కేసీఆర్, హరీశ్ రావు సంతకం పెట్టిండు అని చూపిస్తవా, నేను పదవికి రాజీనామా చేస్తాగోదావరిలో 968 ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అయితే, కృష్ణాలో 299:512ఘనత కూడా కాంగ్రెస్ పార్టీదే కదా,18.10.2013 నాడు ఉమ్మడి ఏపీ జస్టిస్ శ్రీ కృష్ణ కమిటికి రిపోర్టు ఇచ్చింది. ఇదే రిపోర్టును శాసనసభలోనూ పెట్టారు.
తెలంగాణకు కృష్ణాలో 299, ఏపీకి 512 ఇచ్చినం అని ఉంటుంది.ఎవరు మరణ శాసనం రాసారు తెలంగాణ నీటి హక్కులకు.మీ చేతగాని తనం, అడుగులకు మడుగులొత్తడం వల్ల 299 వాటా పరిమితం అయ్యింది.అన్ని డ్యాక్యుమెంట్లు విడుదల చేసేందుకు నేను సిద్దం తెలంగాణ నీటి హక్కులు కాపాడంలో మీడియా క్రియాశీలక పాత్ర పోశించాలని చేతులెత్తి మొక్కుతున్నా అన్నారు.

అడ్ హక్ కు, ఫైనల్ అవార్డుకు తేడా తెలియని అజ్నాని రేవంత్ రెడ్డి.2015 జున్ 26లో చేసుకున్న అగ్రిమెంట్ తాత్కాలిక ఒప్పందం అని లేఖలో ఉంటుంది.
మీ ముద్దుల అడ్వైజర్ ఆదిత్యానాథ్ సంతకం పెట్టిండు. ఆయనే ఇప్పుడు నీ అడ్వైజర్. తెలంగాణ హక్కులకు ఆనాడు వ్యతిరేకంగా మాట్లాడిండు.
తెలంగాణ హక్కులను కాలరాసిన వ్యక్తిని సలహాదారుడిగా పెట్టుకున్నవు బాబు చెప్పు చేతుల్లో ఉన్నవా, తెలంగాణకు పని చేస్తున్నవా గురుదక్షిణ చెల్లించాలనే తపనే తప్ప నీకు తెలంగాణ నీటి ప్రయోజనాలు పట్టవు.కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పగించాలని జోషి గారు అంటే, లేదు లేదు అప్పగించాలని చెప్పిన వ్యక్తి ఆదిత్యా నాథ్ దాస్. అలాంటి వ్యక్తిని సలహాదారుడిగా పెట్టుకున్నడు.ఈ తాత్కాలిక ఒప్పందంపై సంతకం ఎవరు పెట్టారు మీ సలహాదారుడు.కానీ రేవంత్ రెడ్డి నేను పెట్టిన, కేసీఆర్ పెట్టిండు అంటడు.జులై 14, 2014 నాడు కృష్ణాలో 299 అన్యాయం అని కేంద్రానికి లేఖ రాసినం. రాష్ట్రం వచ్చిన 42 రోజుల్లోనే ఆనాటి కాంగ్రెస్ మాకు అన్యాయం చేసింది, కొత్త ట్రిబ్యునల్ వేసి నదీ పరివాహక ప్రాంతం ఆధారంగా కేంద్రాన్ని కోరినం. తెలంగాణ పట్ల మా చిత్తశుద్దికి, నిజాయితీకి నిదర్శనం ఇది.299 కాక, 581 టీఎంసీలు మాకు కావాలని, ఈ లెక్కంత తేలాలంటే ట్రిబ్యునల్ వేసి పంచాలని 22 పేజీల లేఖ రాసినం.299ని మేం ఒప్పుకోలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ రాసిన మరణ శాసనం.తాత్కాలిక ఒప్పందాన్ని చూపి శాశ్వత ఒప్పందం అని అబద్దాలు చెబుతున్నడు రేవంత్ రెడ్డి. 299 లెక్కుకు ద్రోహి ఆదిత్యానాథ్ దాస్, అయన పెట్టిందే ఈ రాచపుండు.ట్రిబ్యునల్ వేయడంలో ఆలస్యం అవుతుందని మొదటి అపెక్స్ కౌన్సిల్ 2016లో చెప్పినం.రెండో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో అడిగితే షకావత్ గారు సుప్రీం కోర్టులో కేసు వాపస్ తీసుకోవాలని చెప్పిండు.అప్పుడు కేసు విత్ డ్రా చేసుకొని, సెక్షన్ 3ని సాధించింది బిఆర్ఎస్. 299 శాశ్వత ఒప్పందం మేము చేసుకుంటే, సెక్షన్ 3 ఎందుకు అడిగాము, అపెక్స్ కౌన్సిల్ ఎందుకు పోయాము, ఎందుకు సుప్రీంకు పోయాము.సెక్షన్ 3పై తెలంగాణ వాదనలు ముగింపు దశలో ఉన్నాయి. 2025లో ఈ ఏడాది 763 టీఎంసీలు మనకు వచ్చే అవకాశం ఉంది.ఈ అమాయక చక్రవర్తి 500 టిఎంసీలు చాలు అని అన్నడు. ఇవి ప్రభావితం చేస్తాయి.
కేసీఆర్ విజయం, బిఆర్ఎస్ విజయం. అవార్డు రాబోతున్నది ఈ ఏడాది.17.2.2025 నాడు రేవంత్ రెడ్డి చేసుకున్న అగ్రిమెంట్ లో ఏముంది. అవే తాత్కాలిక ఒప్పందం చేసుకొని వచ్చిండు.నువ్వు చేసింది ఏముంది రేవంత్ రెడ్డి.అందులో ఏముంది ఫైనల్ అవార్డు వచ్చే దాక 50:50 చేసుకుందామని మీ సెక్రెటరీ రాసిండు. అదే డిమాండ్ ను బిఆర్ఎస్ 28 లెటర్లు రాసి అడిగింది.299 మేము ఒప్పుకోము అని ఎంత ప్రయత్నం చేసినం. పోరాడినం.ఈరోజు తర్వాత 299 కు బిఆర్ఎస్ ఒప్పుకున్నది అని ఎవరైనా అంటే నాలుక చీరేస్తం అన్నారు.

Also Read:కాంగ్రెస్ హయాంలోనే బనకచర్ల ప్రారంభం

ప్రాజెక్టులు కట్టలేదు, నీళ్లు ఇవ్వలేదు అనడం సిగ్గుచేటు. కృష్ణా బేసిన్ లో తెలంగాణ ఏం ప్రాజెక్టులు కట్టలేదు అని రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడిండు.వాస్తవాలు చెబుతా తలకాయ యాడ పెట్టుకుంటవు రేవంత్ రెడ్డి కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్ సాగర్, తుమ్మిళ్ల, జూరాల కెనాల్ మోడ్రనైజేషన్, మిషన్ కాకతీయ ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్ లో 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్. పాలమూరు ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వాలని 28వేల కోట్లు ఖర్చు చేసాం. నాలుగు రిజర్వాయర్లు పూర్తి అయ్యాయి.చంద్రబాబు కాళ్లల్ల కట్టెలు పెట్టిండు, కేసులు వేసిండు.ప్యాకేజీ 3లో బండ పగలకొడితే నీళ్లు వస్తయి.చంద్రబాబు బంగారం, పని మాత్రం చేయవు, నీళ్ళు ఇవ్వవు.గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించినట్లు రేవంత్ నీళ్ల గురించి, కేసీఆర్ గురించి మాట్లాడటం.తండ్రి చనిపోతే కరెంటు లేక నెత్తి మీద నీళ్ళు పోసుకొని వచ్చినా అని రేవంత్ అసెంబ్లీలో మాట్లాడిండు..ఈరోజు పాలమూరు ఎట్ల పచ్చబడ్డది, ఎన్ని నీళ్లు పోతున్నయి. కల్వకుర్తి మోటార్లు ఎందుకు ఆన్ చేయడం లేదు, ఎందుకు రిజర్వాయర్లు నింపడం లేదు.కేసీఆర్ కట్టిన చెక్ డ్యాంల వల్ల, చెరువులు బాగు చేయడం వల్ల, 10లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడం వల్ల పాలమూరు పచ్చబడ్డది..బిఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్లలో 48 లక్షల ఎకరాల 74వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినం.17లక్షల కొత్త ఆయకట్టు, 31 లక్షల స్థిరీకరణ చేసినం.అది మా కమిట్ మెంట్ . రేవంత్ రెడ్డి నువ్వు ఒక చెరువు నింపినవా, చెక్ డ్యాం కట్టినవా…ఏడాదిలో ఆరు లక్షల ఎకరాలకు నీళ్ళు అన్నవు అసెంబ్లీలో, రెండో ఏడాది ఆరు అన్నవు.హెలికాప్టర్ నేనే పెడుతా పోదామా.10లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తే నేను దుంకుత, లేదంటే హెలికాప్టర్ నుంచి దుంకుతవా చెప్పాలన్నారు.

- Advertisement -