పైరసీ వేటలో డీజే !

159
Duvvada Jagannadham leaked online
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం దువ్వాడ జగన్నాథమ్.. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇంతలోనే ఈ సినిమాకు సంబంధించిన సీన్లు సోషల్ నెట్వర్కింగ్ సైట్, కొన్ని వెబ్ సైట్లలో లింక్స్ దర్శనమిచ్చాయి. దీంతో చిత్ర యూనిట్ లీక్ చేసిన వ్యక్తులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. డీజే టీం కూడా సోషల్‌ మీడియాలో సినిమాకు సంబంధించిన కంటెంట్ అప్‌లోడ్ చేస్తున్న వారి పేర్లు, ఐడెంటిటీస్, ఐపీ అడ్రస్‌లను ట్రేస్ చేసే పనిలో పడింది. పైరసీలకు పాల్పడిన వారిని వదిలిపెట్టేదిలేదని ఆ చిత్ర డైరెక్టర్ హరీష్ శంకర్ హెచ్చరించారు. ఆన్ లైన్ పైరసీ లింకులపై సమాచారం ఇవ్వాలని అభిమానులకు పిలుపు నిచ్చారు.

ఎస్వీవి క్రియేషన్స్ బ్యానర్లో 25వ ప్రాజెక్టుగా రూపొందిన ఈ చిత్రాన్ని దిల్ రాజు భారీ వ్యయం వెచ్చించి నిర్మించారు. నెగిటివ్ రివ్యూలు, డివైడ్ టాక్‌ ప్రభావం కొంత డీజేపై పడినప్పటికీ… డీజేకు ఆదరణ తగ్గట్లేదు. ప్రతీ షోకు పాజిటివ్ టాక్ పెరుగడంతో ప్రేక్షకుల సందడి కూడా పెరిగింది. నాలుగు రోజుల్లో రూ.75 కోట్ల వసూళ్లను సాధించింది.

- Advertisement -