‘ఉస్తాద్ భగత్ సింగ్’..సెట్‌లో చిరంజీవి

7
- Advertisement -

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెట్‌లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన పోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పవన్ కళ్యాణ్ హీరోగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, మైత్రి మూవీ మేకర్స్ సెన్సేషనల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతుంది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. హైదరాబాద్‌లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ తో పాటు, సినిమాలోని ప్రముఖ తారాగణం కూడా షూటింగ్‌లో పాల్గొంటోంది.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానరర్ పై నవీన్ యెర్నేని, వై.రవి శంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది.ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆయనంక బోస్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్. రామ్-లక్ష్మణ్ ద్వయం యాక్షన్ సీక్వెన్స్‌లను కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఆనంద్ సాయి ప్రొడక్షన్ డిజైనర్. స్క్రీన్ ప్లే కె. దశరథ్ రాశారు, అడిషినల్ రైటింగ్ సి చంద్ర మోహన్.

Also Read:నల్లమల అడవిలో ఆంక్షలు

- Advertisement -