Kannappa:కన్నప్ప పైరసీపై విష్ణు

7
- Advertisement -

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ సినిమాను మోహన్ బాబు అత్యంత భారీ ఎత్తున నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన కన్నప్ప బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.

అయితే తాజాగా ఈ సినిమాకు పైరసీ కష్టాలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో స్పందించిన విష్ణు.. కన్నప్ప భారీ పైరసీకి గురైందని.. అప్పటికే 30 వేలకు పైగా పైరసీ లింక్‌లను డిలీట్ చేశామని తెలిపారు. అయినా పైరసీ ఆగడం లేదని.. పైరసీలో సినిమా చూడటం అంటే దొంగతనం చేయడంతో సమానం అని మండిపడ్డారు.

మోహన్ బాబు, మోహన్ లాల్, శరత్ కుమార్, ప్రభాస్, అక్షయ్ కుమార్, బ్రహ్మానందం, కాజల్, ప్రియా ముకుందన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

Also Read:తోట శ్రీకాంత్.. థాంక్యూ డియర్

- Advertisement -