కాంగ్రెస్ నిర్లక్ష్యంతో ప్రమాదంలో జూరాల: కేటీఆర్

10
- Advertisement -

జూరాల ప్రాజెక్టులోని 9వ నంబర్ గేట్ రోప్ తెగిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం అని మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో జూరాల ప్రాజెక్టు ప్రమాదంలో పడింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక్క ఇటుక పేర్చడం కూడా చేతకాని ముఖ్యమంత్రికి కనీసం ఉన్న ప్రాజెక్టు నిర్వహణ కూడా రాకపోవడం సిగ్గుచేటు… ప్రతి ఏటా వరద వస్తుందని తెలిసినా స్పిల్ వే వద్ద మెయింటెనెన్స్ పనులు చేయించకపోవడం రేవంత్ సర్కారు నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తోంది అన్నారు.

జూరాలకు క్రమంగా వరద ఉదృతి పెరుగుతుండడంతో రేవంత్ రెడ్డి, మంత్రులు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడాలి… ప్రభుత్వం వెంటనే దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు, ఎగువ నుంచి పెరుగుతున్న ఇన్ ఫ్లోను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పకడ్బందీగా వ్యవహరించాలి అన్నారు. జూరాల ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అన్నారు.

Also Read:పంత్‌పై టీమిండియా మాజీ కోచ్ ప్రశంసలు

- Advertisement -