వీడియో..అంతరిక్షం నుండి శుభాంశు

12
- Advertisement -

భారత వ్యోమగామి శుభాంశు శుక్లా మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి అంతరిక్ష యాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే. అంతరిక్షం నుండి లైవ్ కాల్ చేశారు శుభాంశు.దాదాపు 15 నిమిషాల పాటు ఈ లైవ్ కాల్ సాగింది. అంతరిక్షం నుంచి అందరికీ నమస్కారం. నా తోటి వ్యోమగాములతో ఇక్కడ ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు.

ఇదో గొప్ప ప్రయాణం. మాతో పాటు ఈ రైడ్‌కు జాయ్ (ఒక బేబీ హంస బొమ్మ) కూడా వచ్చింది. భారత సంప్రదాయంలో హంసను విజ్ఞానంగా సూచిస్తారు. భారరహిత స్థితికి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాం. అంతరిక్షంలో ఎలా నడవాలి.. ఎలా తినాలి.. అనే విషయాలను చిన్నపిల్లాడిలా నేర్చుకుంటున్నా అని తెలిపారు.

బుధవారం మధ్యాహ్నం 12.01గంటలకు అమెరికాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి యాక్సియం-4 మిషన్ లో భాగంగా స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్-9 రాకెట్ ద్వారా డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి దూసుకెళ్లింది. గురువారం సాయంత్రం 4.30 గంటల సమయంలో వారు అంతరిక్ష కేంద్రానికి చేరుకుంటారు.

 

Also Read:పాక్‌పై రాజ్‌నాథ్‌ ఫైర్

- Advertisement -