పాక్‌పై రాజ్‌నాథ్‌ ఫైర్

7
- Advertisement -

కొన్ని దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని ఒక విధాన పరికరంగా మలుచుకున్నాయి. తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నాయి అని మండిపడ్డారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్.కొన్ని దేశాలు (పరోక్షంగా పాక్‌ను ఉద్దేశిస్తూ) సీమాంతర ఉగ్రవాద విధానాన్ని సాధనంగా ఉపయోగిస్తున్నాయంటూ చైనా గడ్డనుంచే పాక్‌పై నిప్పులు చెరిగారు.

సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పొరుగుదేశం పాకిస్థాన్‌పై మండిపడ్డారు. తమ సొంత ప్రయోజనాల కోసం ఉగ్రవాదులను పెంచి పోషించే దేశాలు అందుకుతగ్గ పరిణామాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. అలాంటి ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదు. అటువంటి దేశాల చర్యలను ఏ మాత్రం ఊపేక్షించకూడదు అన్నారు.

Also Read:అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన

చైనాలోని కింగ్‌డావోలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశానికి రాజ్‌నాథ్‌ సింగ్‌ హాజరయ్యారు. గల్వాన్‌ లోయ ఘటన తర్వాత ఆయన చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి.

- Advertisement -