అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన

9
- Advertisement -

అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేశ్, ఎంపీ పురందేశ్వరి పాల్గొన్నారు.

రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద రూ.94.44 కోట్ల వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్.. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే శక్తివంతమైన నాయకత్వం అన్నారు.

రాజమండ్రి అంటే గుర్తొచ్చేది గోదావరి తీరం… ఎంతోకాలంగా ఉన్న కలను కూటమి ప్రభుత్వంలో కేంద్ర సహకారంతో సాకారం చేయడం ఆనందదాయకంగా ఉందని తెలిపారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.

Also Read:TTD:30 నుండి శ్రీవారి వైభవోత్సవములు

- Advertisement -