రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకెన్నాళ్లు?:జగన్

5
- Advertisement -

ప్రజా సమస్యలపై ప్రశ్నించినవారిని అణగదొక్కడానికి రెడ్ బుక్ రాజ్యాంగ పరిపాలన తెచ్చారు అని మండిపడ్డారు మాజీ సీఎం జగన్. ఇంత తక్కువ సమయంలో ప్రజల నుంచి దారుణమైన వ్యతిరేకత ఇప్పుడే కనిపిస్తోంది అన్నారు. ప్రజలకు మంచి చేయాల్సింది పోయి.. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని దుయ్యబట్టారు.

జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్లమెంటు నియోజకవర్గాల పరిశీలకులు, జిల్లా పార్టీ అధ్యక్షులతో పాటు, పార్టీ రీజినల్‌ కో–ఆర్డినేటర్లు హాజరు అయ్యారు.

‘బాబు ష్యూరిటీ. మోసం గ్యారెంటీ’. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలు. అమలు చేయకపోవడాన్ని ప్రజల్లో ఎండగడుతూ.. ‘రీకాలింగ్‌ చంద్రబాబూస్‌ మ్యానిఫెస్టో’.. ‘చంద్రబాబు మ్యానిఫెస్టోను గుర్తుకు తెస్తూ..’ పేరుతో వైయస్సార్‌సీపీ 5 వారాల బృహత్తర కార్యక్రమం చేపట్టింది.
దీనికి సంబంధించి క్యూఆర్‌ కోడ్‌ ఆవిష్కరించారు జగన్.

Also Read:కేసీఆర్ స్థాయికి రావాలంటే వందేళ్లు సరిపోవు!

- Advertisement -