26 ఎకరాలైనా చూపించండి.. లేదా తల్లికి వందనమైనా ఇప్పించండి అని ఏపీలో ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. కర్నూలు – కోడుమూరు రూరల్‌లో గాయత్రి అనే మహిళ తల్లికి వందనం రాలేదని అధికారులను సంప్రదించారు. అయితే 26 ఎకరాలు ఉందని అందుకే తల్లికి వందనం ఇవ్వలేదని అధికారులు తెలిపారు.
నా ముగ్గురు పిల్లలకు ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం కింద డబ్బులు రాలేదని.. కారణం అడిగితే 26 ఎకరాల పొలముందంటూ చెబుతున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ డబ్బులైనా ఇప్పించండి.. లేదా పొలమైనా చూపించండంటూ అధికారులను వేడుకున్నారు.
ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో తహసీల్దార్ నాగరాజుకు మొర పెట్టుకున్నారు మహిళ. తమకు నలుగురు సంతానం కాగా, ముగ్గురు కుమార్తెలు, రెండేళ్లలోపు ఒక బాలుడు ఉన్నారని.. ఇందులో ముగ్గురు కుమార్తెలు ప్రస్తుతం 1, 4, 5వ తరగతులు చదువుతుండగా, ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన తల్లికి వందనం డబ్బులు జమ కాలేదని వాపోయింది. తమ పేరు మీద కేవలం ఎకరా 85 సెంట్ల భూమి మాత్రమే ఉందని, అధికారులు చర్యలు తీసుకుని తమకు తల్లికి వందనం పథకం వర్తించేలా చూడాలని తహసీల్దార్‌కు మొరపెట్టుకుంది.
Also Read:స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్..

