- Advertisement -
స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబర్ 30లోగా ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని జస్టిస్ మాధవీదేవి బెంచ్ ఆదేశించింది.
గ్రామ పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించాలంటూ హైకోర్టులో ఆరు పిటీషన్లు దాఖలయ్యాయి. ఈ పిటీషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. ఈ పిటీషన్లపై ఈనెల 23వ తేదీనే వాదనలు ముగియగా తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది.
ఇక ఇవాళ తీర్పు వెలువరించిన జస్టిస్ మాధవీదేవి బెంచ్…. స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30వ తేదీలోగా నిర్వహించాలని ఆదేశించింది.
Also Read:TTD:లడ్డూ కొనుగోలు..నూతన సదుపాయం
- Advertisement -

