మాజీ సీఎం జగన్ పై మరో కేసు నమోదు చేశారు పోలీసులు. గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై కేసు నమోదు చేశారు. అలాగే వైకాపా నేతలకు నోటీసులు ఇచ్చారు నల్లపాడు పోలీసులు.
ఫిబ్రవరి 19న మిర్చి రైతుల పరామర్శ కోసం యార్డుకు వచ్చారు జగన్. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నా వైకాపా నేతలు అనుమతి లేకుండా వచ్చి హడావుడి చేశారనే నేపథ్యంలో జగన్తో పాటు అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తదితరులపై కేసు నమోదు చేశారు.
ఇప్పటికే సింగయ్య మృతి కేసులో జగన్పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. సింగయ్య భార్య చీలి లూర్ధు మేరీ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 106(1) BNS సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు.
ఈ ఘటనకు సంబంధించి పలు వీడియో ఫూటేజీలు, సీసీ ఫూటేజీలు, డ్రోన్ వీడియోలు, అక్కడకు వచ్చిన ప్రత్యక్ష సాక్షులను విచారించి, దీనికి సంబంధించి పలు సాంకేతిక ఆధారాలతో కూడిన సాక్ష్యాలను సేకరించి, ఆ ప్రదేశంలో లభించిన ఇతర ఆధారాలను పరిశీలించి, వాటికి వర్తించే సెక్షన్లను 105 మరియు 49 BNSలకు మార్చారు.
Also Read:చిరు అమ్మకి అనారోగ్యం..వదంతులే!

