- Advertisement -
ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి కేబినెట్ భేటీ ఇది. పాలనా పరమైన అంశాలు, నిర్ణయాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే రైతు భరోసా నిధుల విడుదలలో ప్రభుత్వం రికార్డు, వానాకాలం పంటలు , రైతాంగ సమస్యలపైనా చర్చ జరగనుంది.
స్పోర్ట్స్ పాలసీ పై చర్చించనుంది కేబినెట్. ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ లేఖ, బనకచర్ల ప్రాజెక్టుపై తదుపరి కార్యాచరణ పై చర్చ జరిగే ఛాన్స్ ఉంది.
Also Read:ఇరాన్ సంచలన నిర్ణయం
- Advertisement -

