పాలిటిక్స్‌కు నో..కోచ్‌గా ఓకే!

6
- Advertisement -

పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చారు భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ. త్వరలో పశ్చిమ బెంగాల్ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఏదైనా రాజకీయ పార్టీలో చేరుతారా అన్న ప్రశ్నకు చేరును అంటూ క్లారిటీ ఇచ్చారు దాదా. ఒకవేళ సీఎం పదవి ఇస్తామని హామీ ఇస్తే చేరతారా అన్న ప్రశ్నకు ఆసక్తి లేదంటూ సమాధానమిచ్చారు. అయితే, భారత జట్టు కోచ్‌గా బాధ్యతలు స్వీకరించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

ఈ జూలైలో 53 ఏళ్లు పూర్తి చేసుకోనున్న గంగూలీ, 2018-19 మరియు 2022-24 మధ్య డిల్లీ క్యాపిటల్స్ టీమ్ డైరెక్టర్‌గా పని చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..నిజం చెప్పాలంటే, కోచింగ్ గురించి నేను ఎన్నడూ సీరియస్‌గా ఆలోచించలేదు. ఎందుకంటే నేను క్రికెట్ మానేసిన తర్వాత వివిధ భిన్నమైన పాత్రల్లోకి వెళ్ళాను అని పేర్కొన్నారు.

2013లో క్రికెట్‌ను ముగించాను, తర్వాత BCCI అధ్యక్షుడిగా పనిచేశాను. ఆ పాత్రలో నేను మహిళల క్రికెట్‌ను అభివృద్ధి చేయడమే నా గొప్ప సేవ అని ఆయన తెలిపారు. భారత జట్టు కోచ్‌గా ఉన్నపుడే ఎక్కువగా సాయం చేయగలిగేవారేమోనని ప్రశ్నించగా, గంగూలీ ఇలా స్పందించారు: “భవిష్యత్ ఏమిస్తుందో చూద్దాం. నేను ఇప్పుడే 50 (అంటే 53). చూడాలి ఏమౌతుందో. నాకు కోచింగ్‌పై అభ్యంతరం లేదు. ఎటు వెళ్తుందో చూద్దాం అని చెప్పాడు.

Also Read:ఇరాన్ సంచలన నిర్ణయం

- Advertisement -