ఇజ్రాయెల్ – ఇరాన్ వార్ నేపథ్యంలో అమెరికా సైతం ఇరాన్‌పై దాడులకు దిగడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్‌కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు..
ఇరాన్‌లో ప్రస్తుత పరిస్థితిపై చర్చించారు మోదీ. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలపై ఆందోళన వ్యక్తం చేసిన ఆయన…తక్షణం ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఇరాన్‌కు సూచించారు. చర్చల ద్వారా వివాదాలు పరిష్కరించుకోవాలని తెలిపారు.
మరోవైపు ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హర్ముజ్ జలసంధి మూసివేతకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. భారత్, చైనా సహా ఆసియా దేశాలకు నిత్యం చమురు సరఫరా అయ్యే కీలక మార్గం కావడంతో దాన్ని మూసేస్తే చమురు సంక్షోభం తలెత్తుతుందనే భయాలు నెలకొన్నాయి.ప్రపంచ చమురు సరఫరాలో సుమారు ఐదవ వంతు ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. భారత్‌కు హర్ముజ్ చాలా కీలకం. ఎందుకంటే రోజుకు సుమారు 2 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు (మొత్తం దిగుమతుల్లో 5.5 మిలియన్ బ్యారెళ్లలో) ఈ మార్గం ద్వారానే వస్తోంది.
Also Read:హిందువులు..హిందువుగా ఉండొద్దా?:పవన్

