హిందువులు..హిందువుగా ఉండొద్దా?:పవన్

7
- Advertisement -

మురుగ భక్తర్గల్ మానాడు సదస్సులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ పార్టీ నాయకుడు మురుగన్ సభను తమిళనాడులోనే ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించారని గుర్తు చేసిన పవన్…ఇలాంటి వారు శివుడిపై, అమ్మవారిపై కూడా ప్రశ్నలు వేస్తారంటూ ధ్వజమెత్తారు.

క్రైస్తవుడు‌.. ఒక క్రైస్తవుడిగా‌ ఉండొచ్చు.. ఒక ముస్లిం ముస్లింగా ఉండొచ్చు.. కానీ, హిందువు మాత్రం ఒక హిందువుగా ఉండకూడదు అంటారని తెలిపారు పవన్. ఇక అంతకముందు మధురై విమానాశ్రయంలో పవన్‌కు ఘన స్వాగతం పలికారు తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, అబ్జర్వర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, బీజేపీ నాయకులు.

అనంతరం తిరుపర కుండ్రం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు పవన్.

Also Read:‘అల్లం టీ’తో ప్రయోజనాలు

- Advertisement -