అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది పాకిస్తాన్. రెండు అణు దేశాలైన భారత్-పాక్ మధ్య ఘర్షణల నివారణలో ట్రంప్ కీలక పాత్ర పోషించారని పాక్ వెల్లడించింది. తనకు నోబెల్ శాంతి బహుమతి నాలుగు లేదా ఐదు సార్లు రావాల్సింది అని…వారు నాకు ఇవ్వరు, ఎందుకంటే అది లిబరల్స్‌కే ఇస్తారు అని చెప్పుకొచ్చారు.
రువాండా విషయానికైతే నాకు నోబెల్ బహుమతి ఇవ్వాలి. అలాగే కాంగో, లేదా మీరు సెర్బియా, కోసోవో కూడా చెప్పవచ్చు. చాలా ఉదాహరణలు చెప్పొచ్చు అని ట్రంప్ మీడియాతో అన్నారు. అందులో పెద్దది భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య సమస్య. నాకు ఇది నాలుగు లేదా ఐదు సార్లు రావాల్సింది అని తెలిపారు.
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ – ట్రంప్ భేటీపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. గతంలో ట్రంప్‌కు మద్దతుదారుల నుంచి పలు సార్లు నోబెల్ నామినేషన్లు వచ్చినా, అవార్డు లభించలేదు. ముఖ్యంగా ఇజ్రాయెల్ మరియు అరబ్ దేశాల మధ్య అబ్రహాం ఒప్పందాలు సాధించడంలో ఆయన చూపిన చొరవకు గుర్తింపుగా కొన్ని నామినేషన్లు వచ్చాయి.
నోబెల్ శాంతి బహుమతిని ప్రతి సంవత్సరం నార్వేజియన్ నోబెల్ కమిటీ ప్రదానం చేస్తుంది. ఈ బహుమతిని శాంతిని ప్రోత్సహించడానికి మరియు సంఘర్షణ పరిష్కారానికి కృషిచేసిన వ్యక్తులకు అందజేస్తారు. ట్రంప్ అభ్యర్థిత్వంపై కమిటీ ఎప్పుడూ అధికారిక వ్యాఖ్య చేయలేదు.
Also Read:కౌశిక్ అరెస్ట్..కక్ష సాధింపు చర్యే:హరీష్

