దేశవ్యాప్తంగా డిజిటల్ బ్యాంకింగ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని నకిలీ లింకులు, ఫేక్ యాప్ ద్వారా జరుగుతున్న KYC (Know Your Customer) మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్నారు.
అయితే కేవైసీ ఫ్రాడ్ ఎలా జరుగుతుంది అనడానికి ఉదాహరణ. KYC మోసాల్లో మోసగాళ్లు సాధారణంగా ఖాతా రద్దు లేదా నిలిపివేత పేరిట వ్యక్తుల నుంచి వ్యక్తిగత మరియు బ్యాంకింగ్ సమాచారాన్ని (OTP, CVV, పాస్‌వర్డ్‌లు) దొంగిలించే ప్రయత్నం చేస్తారు. మోసగాళ్లు ఎక్కువగా బ్యాంక్ ఉద్యోగులుగా నటించి, అత్యవసర మెసేజ్‌లు పంపుతారు.
ఈ లింకులు ఎక్కువగా APK ఫైళ్లను డౌన్‌లోడ్ చేయడానికి ప్రేరేపిస్తాయి. ఇవి అసలు బ్యాంక్ యాప్‌లను పోలిన నకిలీ యాప్‌లు. డౌన్‌లోడ్ చేసిన వెంటనే అవి మీ కెమెరా, మైక్రోఫోన్, SMS, కాంటాక్ట్ లిస్ట్ లాంటి అనవసర అనుమతులు అడుగుతాయి. వీటి ద్వారా మోసగాళ్లు OTPలు, పాస్‌వర్డ్‌లు, ఇతర డేటాను దొంగిలించగలుగుతారు. కొన్ని సందర్భాల్లో మీ ఫోన్‌ను రిమోట్‌గా కూడా నియంత్రించగలుగుతారు.
ఈ నకిలీ యాప్‌లు ఎక్కువగా గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ స్టోర్‌ల్లో కాకుండా ఇతర లింకుల ద్వారా పంపబడతాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
()అనుమానాస్పద మెసేజ్‌లలో ఉన్న లింకులపై క్లిక్ చేయకండి, APKలను ఇన్‌స్టాల్ చేయవద్దు.
() OTP, CVV, PIN లాంటి బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ షేర్ చేయకండి.
() ఎప్పుడూ అధికారిక బ్యాంక్ వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా మాత్రమే KYC వివరాలను అప్‌డేట్ చేయండి.
() అనుమానాస్పద మెసేజ్‌లను సైబర్ నేరాల హెల్ప్‌లైన్ 1930 కు లేదా www.cybercrime.gov.in కు నివేదించండి.
() అవసరమైతే సంబంధిత బ్యాంక్ కస్టమర్ కేర్‌ను సంప్రదించండి.
() ఫిషింగ్ ప్రయత్నాలను Sanchar Saathi వెబ్‌సైట్ (sancharsaathi.gov.in) లో నివేదించవచ్చు లేదా మీ బ్యాంక్‌కి ఈమెయిల్ చేయవచ్చు.
Also Read:ఇలా ఈజీగా బరువు తగ్గండి!
నోట్: ఈ వార్త కేవలం సమాచారం కోసమే. ఆర్థిక, న్యాయ లేదా సైబర్ భద్రతా సలహాగా పరిగణించకండి. సందేహాలుంటే సంబంధిత అధికారులను లేదా మీ బ్యాంక్‌కు వెళ్లి వివరాలను తెలుసుకోండి

