KTR:కౌశిక్ రెడ్డి అరెస్ట్ అక్రమం

7
- Advertisement -

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టుపై స్పందించారు మాజీ మంత్రి కేటీఆర్. కౌశిక్ రెడ్డిది అక్రమ అరెస్టు, దుర్మార్గమైన చర్య అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టే కౌశిక్ రెడ్డిపై కక్షకట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారు… బీఆర్ఎస్ నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా న్యాయ పోరాటం చేస్తాము అని హెచ్చరించారు.

ముఖ్యమంత్రి అక్రమాలను, మంత్రుల అవినీతిని, కాంగ్రెస్ నేతల దుర్మార్గాలను అడుగడుగునా ప్రశ్నిస్తున్నారు కాబట్టే ఆయనపై కక్షకట్టి అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు.గత ఏడాదిన్నర కాలంగా కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు చేస్తున్న అన్యాయాలపై నిలదీస్తున్న కౌశిక్ రెడ్డిని తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టే కుట్ర అనేక నెలల నుంచి కొనసాగుతూనే ఉందన్నారు.

ఇలాంటి చిల్లర చేష్టలు, పనికిరాని కేసులు, బీఆర్ఎస్ నేతల సంకల్పాన్ని, మనోధైర్యాన్ని ఎప్పటికీ దెబ్బతీయలేవని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యమని చెప్పుకునే రేవంత్ ఎమర్జెన్సీని తలపించేలా ప్రశ్నించే గొంతులపై అణచివేత చర్యలతో ప్రజాక్షేత్రంలో అబాసపాలవుతున్నాడని తెలిపారు. తమపై, తమ నేతలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినా అవి కోర్టుల్లో నిలబడే అవకాశమే లేదని స్పష్టం చేశారు.

Also Read:ఇలా ఈజీగా బరువు తగ్గండి!

- Advertisement -