బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో ఏపీ మంత్రి నారా లోకేశ్ భేటీ అయ్యారు. ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యలో AI టూల్స్ వినియోగంపై ప్రధానంగా వీరిద్దరి మధ్య చర్చ జరిగింది. నైపుణ్య శిక్షణ అంశాలు మరియు గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారంపై ఒప్పందం జరిగింది.ఉన్నత విద్యలో సంస్కరణలు, సాంకేతిక మద్దతు చర్చించారు.
అలాగే ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో నారా లోకేశ్ భేటీ అయ్యారు. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి సహకారం అందించాలని కోరారు. ఏపీని స్పోర్ట్స్ హబ్‌గా మార్చేందుకు చేయూత ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
గుంటూరు-నాగార్జున యూనివర్సిటీలో అథ్లెటిక్స్, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్.. కాకినాడలో డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ గ్రౌండ్స్‌లో హాకీ, షూటింగ్‌లకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లను ఏర్పాటు చేయాలని కోరారు.
Also Read:నైపుణ్యం ఉంటేనే సక్సెస్!

