మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తన కొత్త చిత్రం #RT76 తో మరోసారి తన సిగ్నేచర్ ఎనర్జీతో అలరించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ ఇటీవల పూజా వేడుకతో ప్రారంభమైయింది. ప్రేక్షకులను ఆకట్టుకునే హై ప్రొడక్షన్ వాల్యూస్ తో చిత్రాలను అందించే SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న #RT76 హ్యుమర్, ఎమోషన్స్ తో కూడిన హోల్సమ్ ఎంటర్ టైనర్ గా వుండబోతోంది.
ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన ఈ సినిమాను ఇక రెగ్యులర్ షూటింగ్‌తో షురూ చేశారు. ఈ సినిమా టాకీ పార్ట్‌లో భాగంగా పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఈ సినిమాలో రవితేజ తనదైన కంఫర్ట్ జోన్లో నటిస్తూ ప్రేక్షకులను అలరించనున్నాడు.
ఇక ఈ సినిమా నుంచి టైటిల్, ఫస్ట్ లుక్‌ను అతి త్వరలో రివీల్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా హీరోయిన్గా ఎవరు నటిస్తున్నారనే విషయంపై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది.
Also Read:సమంత…అసహనం!

