రహానె సెంచరీ.. విండిస్‌పై భారత్‌ విజయం

190
india-wins-windies-1st-odi
india-wins-windies-1st-odi
- Advertisement -

భారత్‌-వెస్టిండీస్‌ మధ్య ఆదివారం జరిగిన రెండో వన్డేలో టీమ్‌ఇండియా బోణి కొట్టింది. అటు బ్యాటింగ్‌.. ఇటు బౌలింగ్‌లో సత్తా చాటిన భారత్‌.. ఏకంగా 105 పరుగుల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. ఐదు వన్డేల సిరీస్‌లో 1-0తో ముందంజలో నిలిచింది భారత్. 311 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్‌.. భారత్‌ బౌలర్ల దెబ్బకు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 205 పరుగులు మాత్రమే చేసింది.

CRICKET-TRI-WIS-IND

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్‌కు ఓపెనర్లు అజింక్యా రహానే(104 బంతుల్లో 103; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) శతకంతో, ధావన్‌ (59 బంతుల్లో 63; 10 ఫోర్లు), కోహ్లీ(66 బంతుల్లో 87; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించడంతో భారత్‌ 43 ఓవర్లలో ఐదు వికెట్లకు 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. 39 ఓవర్లకు భారత్‌ స్కోరు 260/4. అప్పటికే భారత్‌ మెరుగైన స్థితిలో ఉండటంతో మరో ఎండ్‌లో ఉన్న విరాట్‌ బ్యాట్‌ ఝళిపించాడు. బౌండరీలు, సిక్సర్లతో చెలరేగుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. 285 పరుగుల వద్ద జోసెఫ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి కోహ్లి ఔటవడంతో ధోనీ(13: నాటౌట్‌), జాదవ్‌ 13: నాటౌట్‌) ఆఖర్లో చెలరేగి ఆతిథ్య జట్టుకు 311 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. జోసెఫ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అంతకుముందు భారీ వర్షం కారణంగా మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు.

CRICKET-TRI-WIS-IND

భారీ లక్ష్య చేదనకు దిగిన విండీస్ కు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఓపెనర్ పోవెల్‌ భువనేశ్వర్‌ వేసిన తొలి ఓవర్ మూడో బంతికే డకౌటయ్యాడు. ఆ తర్వత క్రీజులోకి వచ్చిన మహ్మద్‌ను కూడా భువీ డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. మరో ఓపెనర్‌ షై హోప్‌(89) ఒంటిరి పోరాటం చేయగా మిగతా బ్యాట్స్‌మెన్‌ నుంచి సహాకారం అందకపోవడంతో నిర్ణీత 43 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఇక భారత్‌ బౌలర్లలో భువీ 2, కుల్దీప్‌ యాదవ్‌ (3), అశ్విన్‌ (1) దక్కాయి. శతక వీరుడు అజింక్యా రహానేకు మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌ వరించింది.

- Advertisement -