బనకచర్ల ప్రాజెక్ట్ పేరుతో ఏపీ చేస్తున్న జల దోపిడి- కాంగ్రెస్ మౌనం” అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ (PPT) ద్వారా వివరించారు మాజీ హరీష్ రావు. కృష్ణా జలాల్లో జలదోపిడి జరిగినట్లు, గోదావరి జలాలను బనక చర్ల ద్వారా ఏపీ దోపిడి చేస్తున్నది…సీఎం రేవంత్, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి మౌనంగా ఉంటున్నారు అన్నారు.
కేటీఆర్ మీద, బి ఆర్ ఎస్ నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడంలో బిజి ఉన్నరు..ప్రతిపక్షాల మీద ఇరిటేషన్ తప్ప, ఇరిగేషన్ మీద దృష్టి లేదు..రాష్ట్ర ప్రయోజనాలు పదవుల కోసం తాకట్టు పెడుతున్నారు…ఏపీ అక్రమ ప్రాజెక్టు కడుతుంటే మీ మౌనం వెనుక ఉన్న కారణం?,గోదావరి బనకచర్లకు టెండర్లు పిలుస్తుంటే ఎందుకు నోరు మెదపడం లేదు…కృష్ణా నీళ్ళు తాత్కాలిక ఒప్పందానికి మించి ఏపీ తీసుకుపోతుంటే ఎందుకు మాట్లాడరు చెప్పాలన్నారు.
గోదావరి నదిలో తెలంగాణకు ద్రోహం తలపెడితే ఎందుకు స్పందించరు…నిధులు, నదులు రెండు ఆంధ్రకే..8 మంది బిజెపి ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా నిధుల్లో, నదుల్లో అన్యాయం జరిగినా మాట్లాడరు,ఇద్దరు కేంద్రమంత్రులు ఉండి నోరు మెదపడం లేదు..2 TMC బాబ్లీ ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర మీద చంద్రబాబు పెద్ద పోరాటం చేశారు.మరి నేడు 200 TMC ల బనకచర్ల ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఎంత పోరాటం చేయాలి. రేవంత్ రెడ్డి ఎందుకు ఒక్క మాట మాట్లాడటం లేదు.మీ దోస్తానా కోసం తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడతారా రేవంత్?,తెలంగాణ కంటే పది రెట్ల నిధులు ఆంధ్రకి ఇచ్చినమని స్వయంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆంధ్రాలో చెప్పాడు అన్నారు.
కేంద్రంలో పరపతి తో చంద్రబాబు పై నుండి కాకుండా పోలవరం నుండి నీళ్ళు మళ్ళించి, కేంద్రం నుండి నదుల అనుసంధానం పేరుతో నిధులు తెచ్చుకున్నది.
అయినా రేవంత్ రెడ్డికి, మంత్రులకు కదలిక లేదు..ఇప్పటికైనా కళ్ళు తెరవండి, నష్టం పూర్తిగా జరగకముందే గోదావరి బనకచర్ల ప్రాజెక్టు అడ్డుకావాలి అని డిమాండ్ చేస్తున్నాం.ఏ రకమైన పోరాటంలోనైనా BRS కలిసి వస్తుంది. అసెంబ్లీలో తీర్మానం చేద్దామంటే సహకరిస్తాం.మీరు ముందుకు రాకపోతే బిఆర్ఎస్ పార్టీ ప్రజా పోరాటానికి, న్యాయపోరాటానికి శ్రీకారం చుడుతుంది. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టకు.రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు బంద్ చేయి.
చరిత్ర హీనుడిగా మిగిలిపోకు. బిజెపి, కాంగ్రెస్ ఎంపీలు మౌనం వీడండి. చంద్రబాబు జల దోపిడిని అడ్డుకోండి అన్నారు.

