లాస్‌ఏంజెల్స్‌లో కర్ఫ్యూ…ఎమర్జెన్సీ

5
- Advertisement -

అమెరికాలోని లాస్ ఏంజెలెస్‌లో కర్ఫ్యూ.. ఎమర్జెన్సీ ప్రకటించారు మేయర్. వలస సేవలు, సుంకాల అమలు విభాగం (ఐసీఈ-ఐస్) చేస్తున్న అక్రమ వలసదారుల అరెస్టులకు నిరసనగా లాస్ ఏంజెల్స్‌లో ఆందోళనలు మొదలయ్యాయి.

సియాటిల్ నుంచి ఆస్టిన్ వరకు, అటు షికాగో నుంచి వాషింగ్టన్ డీసీ వరకు ఆందోళనలు కొనసాగుతుండగా మరోవైపు, సోదాలను ఆపేదిలేదని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

లాస్‌ ఏంజెలెస్‌లో మొత్తం 44 మంది అక్రమ వలసదారులు సహా ఇమ్మిగ్రేషన్‌ అధికారులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఫెడరల్‌ అధికారులు తెలిపారు. వారందరినీ పారమౌంట్ నగరంలోని ఫెడరల్‌ డిటెన్షన్‌ సెంటర్‌కు తరలించారు. ఈ చర్య స్థానికులకు ఆగ్రహం తెప్పించింది. వందలమంది ఆందోళనకారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. లాస్ ఏంజిల్స్‌లో ఆందోళనలను అణిచివేయడానికి 2 వేల మంది కాలిఫోర్నియా నేషనల్ గార్డ్స్‌ను మోహరించాలని ఆదేశాలు జారీచేశారు.

కాలిఫోర్నియాలో డెమోక్రాటిక్ పార్టీ అధికారంలోకి ఉంది. నేషనల్ గార్డ్స్‌ను పంపుతూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ తీవ్రంగా వ్యతిరేకించారు.

Also Read:తెలుగు రాష్ట్రాలు..వెదర్ అప్‌డేట్

- Advertisement -