కోలీవుడ్ కపుల్ నయనతార-విఘ్నేశ్ శివన్ దంపతులు తమ పెళ్లీ రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. మూడో వివాహ వార్షికోత్సవం సందర్భంగా విహార యాత్రలో వారు దిగిన ఫోటోలను నయన్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు.
మనంలో మనం ఎవరం ఎక్కువగా ప్రేమిస్తామనే విషయంలో ఆశ్చర్యపోతోంటాం.. ఆ ప్రశ్నకు మాత్రం ఎప్పుడూ మన మధ్య సమాధానం దొరకలేదు.. మన బంధం గురించి వివరించలేం.. నువ్వే నా సర్వస్వం, ప్రపంచం.. ఇద్దరం కాస్తా నలుగురం అయ్యాం.. ఇంత కంటే ఎక్కువగా నేనేం అడగగలను.. ప్రేమంటే ఏంటో.. ప్రేమ ఎలా ఉండాలో నువ్వే నాకు నేర్పించావు.. చూపించావు.. హ్యాపీ యానివర్సరీ మై పార్ట్నర్ అంటూ నయన్ పోస్ట్ చేశారు.
విఘ్నేష్ శివన్ ను 2002జూన్ 9న ప్రేమపెళ్లి చేసుకుంది నయన్. పెళ్లి తర్వాతా ఈ జంట సరోగసి పద్దతిలో కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ప్రస్తుతం చిరంజీవి అనిల్ రావిపూడి మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు.
Also Read:Talasani:మాగంటి మృతి బాధాకరం

