ఏపీ సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్..

7
- Advertisement -

ఏపీలోని ప్రజాప్రతినిధులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా 12న అమరావతిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఏడాదిలో చేసిన కార్యక్రమాలు ప్రజలకు వివరించనున్నారు.

ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు అనే సమాచారం నా దగ్గర ఉంది… ప్రజలు మనలను గమనిస్తున్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలి అని తెలిపారు చంద్రబాబు. ఎవరైనా వన్ టైమ్ ఎమ్మెల్యేలుగా మిగిలిపోవద్దు అని సూచించారు.

2024 జూన్ కు ముందు ఏపీ ఆర్థిక సంక్షోభంలో ఉంది… ఏపీ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. ఏపీలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగిస్తున్నాం.. వచ్చే నెల నాటికి పార్టీలోని అన్ని కమిటీల నియామకం జరుగుతుందన్నారు.

Also Read:కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ప్రచారాలు – వాస్తవాలు 

- Advertisement -