ఖైరతాబాద్ గణేష్ విగ్రహ తయారీకి అంకురార్పణ

7
- Advertisement -

కర్ర పూజతో 71 వ ఖైరతాబాద్ గణేష్ విగ్రహ తయారీ పనులకి అంకురార్పణ జరిగింది. ఈ సంవత్సరం 69 అడుగుల ఎత్తులో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు ఖైరతాబాద్ గణేషుడు. ఖైరతాబాద్ బడా గణేష్ రూపాన్ని విడుదల చేశారు ఉత్సవ సమితి సభ్యులు. శ్రీ విశ్వశాంతి మహా స గా దర్శనం ఇవ్వనున్నారు ఖైరతాబాద్ గణేష్.

ఇరువైపులా కుడి పక్కన శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఎడమవైపు లలిత త్రిపుర సుందరి, శ్రీ గజ్జలమ్మ దేవి ఉన్నారు. కర్ర పూజ కు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ , ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి హాజరయ్యారు. 70 సంవత్సరాలనుండి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి అన్నారు దానం.

71 సంవత్సరం సందర్బంగా జరుగుతున్న వేడుకలకు కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూసుకుంటాం..జాతీయ స్థాయి లో ఖైరతాబాద్ గణనాధుడు పేరు ప్రతిష్టలు వచ్చాయి..మాగంటి గోపినాథ్ త్వరగా కోలుకుని ఖైరతాబాద్ గణేష్ ను దర్శించుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అన్నారు. ప్రభుత్వం పోలీస్ శాఖ అన్ని విధాలుగా మాకు సపోర్ట్ చేసింది…మీడియా పాత్ర ఎప్పటికి మరచిపోలేము…ప్రతి ఒక్కరు ఈ సారి జరిగే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు సపోర్ట్ గా ఉంటారని ఆశిస్తున్నా అన్నారు.

Also Read:కాళేశ్వరం కమిషన్‌ విచారణకు ఈటల

- Advertisement -