మల్లు రవిపై సంపత్ కుమార్ ఫైర్

8
- Advertisement -

ఎంపీ మల్లు రవికి వయసు ఎక్కువ, చాదస్తం ఎక్కువ అని మండిపడ్డారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్. గాంధీ భవన్ లో మీడియాతో చిట్ చాట్ సందర్భంగా మల్లు రవిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన గెలుపు కోసం మా రక్తం దార పోసినం అన్నారు.

అలంపూర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల గురించి మీనాక్షి నటరాజన్ కు వివరణ ఇచ్చాను అని… మల్లు రవి అత్యుత్సాహంతో ఏదో చేయబోయి ఇరుక్కున్నాడు అన్నారు.

అంతేఆగాదు మా ఎంపీ బిల్లులు విడుదల చేయడానికి 10 శాతం కమిషన్ తీసుకుంటున్నాడు అని ఏకంగా కాంగ్రెస్ అధిష్టానానికే ఫిర్యాదు చేశారు. పెండింగ్ బిల్లులను ఇప్పించి వారి నుంచి 10 శాతం కమిషన్ వసూలు చేసుకుని తన సొంత లాభానికి పాల్పడ్డాడని ఆరోపణలు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీని అభాసుపాలు చేస్తూ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Also Read:అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్..ఉత్తమ్

- Advertisement -