తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు విచారణ

9
- Advertisement -

బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఈ కేసును సుమోటోగా కేసును తీసుకున్న కర్ణాటక హైకోర్టు… ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ చేపట్టనుంది. ఆలోపు నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ప్రమాదానికి గల కారణాలను వివరించాలని తెలిపింది.

బెంగళూరు తొక్కిసలాటలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంచనాలకు మించి ఫ్యాన్స్ రావడంతోనే ఘటన జరిగిందని తెలుస్తోంది. ఫ్రీ పాసులు ఇస్తున్నారంటూ వదంతులు వ్యాప్తి చెందగా చిన్న స్వామి స్టేడియం కెపాసిటీ 35 వేలు. అయితే.. నిన్న సాయంత్రం దాదాపు 3 లక్షల మంది రాగ స్టేడియంలో 21 స్టాండ్లు, 13 గేట్లు ఉండగా 5, 6, 7 గేట్ల నుంచి అభిమానులకు ప్రవేశం కల్పించారు.

7వ నెంబర్ గేట్ వద్ద అభిమానులు పోటెత్తారు. ఇక్కడే తొక్కిసలాట జరిగినట్లు గుర్తించారు.

Also Read:పర్యావరణ దినోత్సవం..విశేష స్పందన

- Advertisement -